Naresh : లగ్జరీ కారవాన్ సొంతం చేసుకున్న సీనియర్ నటుడు నరేష్.. ప్రత్యేకంగా ముంబై నుంచి..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కారవాన్ గురించి నరేష్ మాట్లాడుతూ.. ''నటీనటులకు కారవాన్‌లు మరో ఇల్లు లాంటివి. నా జీవితంలో 70 శాతం ఈ వాహనాల్లో గడిచిపోతుంటుంది. దాంతో కార్ల కోసం ఖర్చు...

Naresh :  లగ్జరీ కారవాన్ సొంతం చేసుకున్న సీనియర్ నటుడు నరేష్.. ప్రత్యేకంగా ముంబై నుంచి..

Naresh

Naresh :  సినీ సెలబ్రిటీలు షూటింగ్ సమయాల్లో గ్యాప్ వస్తే, లేదా షూటింగ్ టైంలో రెడీ అవ్వడానికి కారావాన్ ని ఉపయోగిస్తారు. చాలా మంది సెలబ్రిటీలకు కారవాన్ ని ప్రొవైడ్ చేస్తారు నిర్మాతలు. అయితే కొంతమంది స్టార్ సెలబ్రిటీలు మాత్రం తమ కారవాన్ ని సొంతంగా తెచ్చుకుంటారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలకి సొంతంగా కారవాన్ లు ఉన్నాయి. వీటిని స్పెషల్ గా వాళ్లకి కావలసినట్టు లగ్జరీగా తయారు చేయించుకున్నారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ కూడా లగ్జరీ కారవాన్ ని సొంతం చేసుకున్నారు.

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నారు సీనియర్‌ నటుడు నరేశ్‌. ప్రస్తుతం నరేష్ చేతి నిండా సినిమాలున్నాయి. ఇంట్లో కంటే కారవాన్‌లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారంట. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్‌ని వాడటం మంచిది కాదని భావించి ఆయన ఇటీవల ప్రత్యేకంగా ఓ వ్యాన్‌ని కొనుగోలు చేశారు. దాన్ని తన అభిరుచులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్పెషల్ కారవాన్ ని ముంబై నుంచి తెప్పించారని సమాచారం. ఈ కారవాన్ లో ఏసీ, బెడ్‌, మేకప్‌ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్ ఉన్నాయి.

Vijay Devarakonda : ఒడిశా సముద్ర తీరంలో ‘లైగర్’.. సైకత శిల్పంతో\

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ కారవాన్ గురించి నరేష్ మాట్లాడుతూ.. ”నటీనటులకు కారవాన్‌లు మరో ఇల్లు లాంటివి. నా జీవితంలో 70 శాతం ఈ వాహనాల్లో గడిచిపోతుంటుంది. దాంతో కార్ల కోసం ఖర్చుపెట్టే బదులు మంచి కారవాన్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేరే వాళ్లు వాడిన కారవాన్‌లో ఉండటం కూడా అంత ఉత్తమం కాదు. నా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని కొనుగోలు చేశాను’’ అని నరేశ్‌ తెలిపారు.