ఆహా.. ఆటోలోనే అదిరిపోయే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రాకు కూడా నచ్చేసింది

ఆహా.. ఆటోలోనే అదిరిపోయే ఇళ్లు.. ఆనంద్ మహీంద్రాకు కూడా నచ్చేసింది

ఆహా.. అనిపించే కొన్ని విషయాలు ఆశ్చర్యపరిచినా.. చూస్తుంటే సంతోషంగా ఉంటుంది కదా? అవును.. ఆటోలోనే ఇళ్లు అంటే మాటలా? అదిరిపోయే ఇళ్లు ఆటోలో కట్టేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ ఆర్కిటెక్ట్. అరుణ్ ప్రభు.. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ అరుణ్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న స్థలాన్ని కూడా నివాస యోగ్యంగా ఎలా మార్చాలో చూపిస్తూ అరుణ్ ఓ ఆటోపై ఇళ్లును నిర్మించి.. చూటడానికి అచ్చు ఇల్లులాగా కనిపించే సంచార గృహం వైరల్ అయింది.

నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ ఆటో ఇళ్లును చూసి ఔరా..!! అంటూ అరుణ్ ప్రభు పనితనాన్ని మెచ్చుకున్నారు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం.. పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా. అరుణ ప్రభు ఐడియా నచ్చడంతో ఆనంద్ మహీంద్రా ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఆయన కాంటాక్ట్ వివరాలు ఎవరైనా తెలుపగలరా అంటూ నెటిజన్లను కోరారు.

చిన్ని చిన్ని స్థలాల్లోనూ నివాస సదపాయాలను ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో సూచించేందుకు అరుణ్ దీన్ని డిజైన్ చేశారని తెలిసింది. అయితే.. అరుణ్ దృష్టి ఇంతకంటే పెద్ద ట్రెండ్‌పైనే పడిందని నేను అనుకుంటున్నాను. ఆయన బొలెరోపై కూడా ఇటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేయగలరా..? ఆయన కాంటాక్ట్ వివరాలు ఎవరైనా చెప్పగలరా..? అంటూ ట్వీట్ చేశారు.