Gujarat AAP’s CM Candidate Isudhan : గుజరాత్‌ ఆప్‌ సీఎం అభ్యర్థిగా ఇసుధాన్‌.. ప్రకటించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్‌ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు ఇసుధాన్‌ గఢ్వీని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రకటించారు. పార్టీలో ఓటింగ్‌ ద్వారానే ఇసుధాన్‌ను ఎంపికచేసినట్టు తెలిపారు.

Gujarat AAP’s CM Candidate Isudhan : గుజరాత్‌ ఆప్‌ సీఎం అభ్యర్థిగా ఇసుధాన్‌.. ప్రకటించిన అరవింద్‌ కేజ్రీవాల్‌

Gujarat AAP’s CM Candidate Isudhan : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్‌ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు ఇసుధాన్‌ గఢ్వీని ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రకటించారు. పార్టీలో ఓటింగ్‌ ద్వారానే ఇసుధాన్‌ను ఎంపికచేసినట్టు తెలిపారు.

ఓబీసీ సామాజికవర్గానికి చెందిన ఇసుధాన్‌ గఢ్వీ (40) గుజరాత్‌లో పేరెన్నికగల జర్నలిస్టు. రాష్ట్రంలో పలు కుంభకోణాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆప్‌ జాతీయ సంయుక్త కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Gujarat Assembly Election 2022: డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల

గఢ్వీ  స్వగ్రామం ద్వారక జిల్లాలోని పిపాలియా. రైతు కుటుంబంలో పుట్టారు. జర్నలిజంలో మాస్టర్స్‌ చదివి మొదట జర్నలిస్టుగా దూరదర్శన్‌లో పనిచేశారు. 2007 నుంచి 2011 వరకు ఈటీవీ గుజరాతీలో ఆయన పని చేశారు.