PM Modi: ‘జీ20 లోగో’ ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న సదస్సు

ఇండియాకు ప్రతిష్టాత్మకంగా నిలవనున్న ‘జీ20’ సదస్సు లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. మంగళవారం సాయత్రం ఆయన లోగోతోపాటు, థీమ్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ సదస్సు జరుగుతుంది.

PM Modi: ‘జీ20 లోగో’ ఆవిష్కరించిన ప్రధాని మోదీ.. వచ్చే ఏడాది ఇండియాలో జరగనున్న సదస్సు

PM Modi: వచ్చే ఏడాది ఇండియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న ‘జీ20’ సదస్సుకు సంబంధించిన లోగోను ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ‘జీ20 లోగో’తోపాటు థీమ్, వెబ్‌సైట్‌ను మోదీ మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. భారతీయత ప్రతిబింబించేలా ఈ లోగో రూపొందింది.

Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?

దీనిపై ‘వన్ ఎర్త్.. వన్ ఫ్యామిలీ.. వన్ ఫ్యూచర్’ అనే ఇంగ్లీష్ క్యాప్షన్ కూడా కనిపిస్తుంది. అలాగే హిందీలో ‘వసుధైవ కుటుంబకమ్’ అని రాసి ఉంది. లోగోలో ఏడు రేకులతో ఉన్న కమలం పువ్వు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూనే, ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చే చిహ్నంగా ఉంది. అలాగే ఈ ఏడు రేకులు.. సంగీతంలోని ఏడు స్వరాలను కూడా సూచిస్తాయి. 2023 సెప్టెంబర్‌లో జరగబోయే జీ20 దేశాల సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇది అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన సదస్సు. జీ20 గ్రూపుగా ఏర్పడ్డ దేశాలు అత్యంత శక్తివంతమైనవి. ఇవి ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగి ఉన్నాయి.

Sania Mirza: సానియా మీర్జా విడాకులకు సిద్ధమైందా.. షోయబ్ ఆమెను మోసం చేశాడా?

అలాగే ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో 67 శాతం వాటా కలిగి ఉన్నాయి. జీ20 దేశాల సదస్సుకు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతుండటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. జీ20 సదస్సుకు అధ్యక్ష బాధ్యతలు (ప్రెసిడెన్సీ) చేపడుతున్న సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ అధ్యక్ష పదవి ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.