Rajasthan: నా రాజీనామా లేఖ సోనియా దగ్గరే ఉంది: రాజస్థాన్ సీఎం | My resignation letter is permanently with Sonia Gandhi, says Gehlot

Rajasthan: నా రాజీనామా లేఖ సోనియా దగ్గరే ఉంది: రాజస్థాన్ సీఎం

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ చెప్పారు.

Rajasthan: నా రాజీనామా లేఖ సోనియా దగ్గరే ఉంది: రాజస్థాన్ సీఎం

Rajasthan: రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను మార్చబోతున్నారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. తన రాజీనామా లేఖ సోనియా గాంధీ వద్దే ఉందని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు పదవి నుంచి తీసేయొచ్చని అశోక్ గెహ్లాట్ చెప్పారు. శనివారం గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన పదవి గురించి వస్తున్న హాగానాలు నమ్మొద్దని కోరారు. రాజస్తాన్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకంటే ముందే అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధిష్టానం పదవి నుంచి తప్పిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

 

ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ అసంతృప్త నేత సచిన్ పైలట్ సోనియా గాంధీని కలిశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ప్రచారం ఎక్కువ కావడంతో అశోక్ గెహ్లాట్ స్వయంగా స్పందించారు. పదవి నుంచి తప్పించబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

×