Assam Baby: రికార్డ్ బ్రేక్.. 5.2 కేజీల బరువుతో బాలుడు జననం!

అస్సాం రాష్ట్రంలో పుట్టే బిడ్డల సగటు బరువు 2.5 కేజీలు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అత్యధిక బరువున్న శిశువుగా 4 కేజీలు రికార్డు. అలాంటిది ఓ మహిళ 5.2 కేజీల బరువుతో ఓ బాలుడికి జన్మనిచ్చింది. ఇదే ఇప్పుడు అతిపెద్ద రికార్డుగా ఇక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.

Assam Baby: రికార్డ్ బ్రేక్.. 5.2 కేజీల బరువుతో బాలుడు జననం!

Assam Baby

Assam Baby: అస్సాం రాష్ట్రంలో పుట్టే బిడ్డల సగటు బరువు 2.5 కేజీలు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అత్యధిక బరువున్న శిశువుగా 4 కేజీలు రికార్డు. అలాంటిది ఓ మహిళ 5.2 కేజీల బరువుతో ఓ బాలుడికి జన్మనిచ్చింది. ఇదే ఇప్పుడు అతిపెద్ద రికార్డుగా ఇక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. అస్సాంలోని సిల్చార్‌కు చెందిన ఒక మ‌హిళ 5.2 కేజీల బ‌రువున్న బాబుకు జ‌న్మ‌నిచ్చింది.

సతీంద్ర మోహన్ దేవ్ సివిల్ హాస్పిటల్ లో సీనియ‌ర్ డాక్ట‌ర్ల బృందం బాదల్ దాస్ అనే మహిళకు సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. తీరా చూస్తే బాబు 5.2 కేజీల బ‌రువుతో ఆరోగ్యంగా ఉన్నాడు. జయ దాస్, బాదల్ దాస్ దంప‌తుల‌కు తొలి సంతానం 3.8 కిలోల బ‌రువుతో పుట్టగా ఈ బాబు రెండో సంతానం. దీంతో ఇప్పటి వరకు ఉన్న అత్యధిక బరువుగల శిశువు రికార్డు బ్రేక్ అయింది.