Assam: మ‌నీశ్ సిసోడియాపై అసోం సీఎం భార్య రూ.100 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా

ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియాపై గువాహ‌టిలోని కామ్‌రూప్ సివిల్ జ‌డ్జ్ కోర్టులో అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు ప‌రువు న‌ష్టం దావా వేశారు.

Assam: మ‌నీశ్ సిసోడియాపై అసోం సీఎం భార్య రూ.100 కోట్ల‌కు ప‌రువున‌ష్టం దావా

Manish

Assam: ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియాపై గువాహ‌టిలోని కామ్‌రూప్ సివిల్ జ‌డ్జ్ కోర్టులో అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్ శర్మ రూ.100 కోట్లకు ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ నెల 4న మ‌నీశ్ సిసోసియా మీడియాతో మాట్లాడుతూ.. అసోం ముఖ్య‌మంత్రి భార్య‌కు చెందిన సంస్థ‌ల‌కు, ఆయ‌న‌ కుమారుడి వ్యాపార భాగ‌స్వామికి పీపీఈ కిట్ల పంపిణీ కాంట్రాక్టులు మార్కెట్ రేట్ల‌కు మించి ఇచ్చారని ఆరోపించారు. 2020లో దేశంలో క‌రోనా ఉద్ధృతంగా ఉన్న స‌మ‌యంలో ఈ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని అన్నారు.

Presidential Elections: 27న నామినేష‌న్ వేయ‌నున్న య‌శ్వంత్ సిన్హా.. ఎన్డీఏ అభ్య‌ర్థి 25న‌?

ఈ నేప‌థ్యంలోనే రినికి భుయాన్ శర్మ ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ కేసు బుధ‌వారం విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తాము భావిస్తున్నామ‌ని రినికి భుయాన్ శ‌ర్మ త‌ర‌ఫు న్యాయ‌వాది ప‌ద్మాధ‌ర్ నాయ‌క్ తెలిపారు. కాగా, త‌మ‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తున్నందుకు సిసోడియాపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హిమంత బిశ్వ శ‌ర్మ ఇటీవ‌ల చెప్పారు. క‌రోనా కార‌ణంగా భార‌త్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న స‌మ‌యంలో త‌మ భార్య రినికి భుయాన్ శ‌ర్మ సేవా దృక్ప‌థంతో ముందుకు వ‌చ్చి దాదాపు 1,500 పీపీఈ కిట్ల‌ను ప్ర‌భుత్వానికి ఉచితంగా ఇచ్చార‌ని ఆయ‌న అన్నారు. ఇందుకోసం ఆమె ఒక్క పైసా కూడా తీసుకోలేద‌ని తెలిపారు.