Drug Peddling: ఫుడ్ డెలివరీ బాయ్స్.. ముసుగు తీస్తే డ్రగ్స్ సరఫరా!

కరోనా సమయంలో కూడా డ్రగ్స్ ముఠాలు కొత్త దారుల్లో సరఫరాకి దిగుతున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్స్ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ బయటపడడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. ఫేమస్ ఫుడ్ డెలివరీ సంస్థలలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూనే డ్రగ్స్ సరఫరాకు దిగిన ముగ్గురు పోలీసుల చేతికి చిక్కి జీవితాలను నాశనం చేసుకున్నారు.

Drug Peddling: ఫుడ్ డెలివరీ బాయ్స్.. ముసుగు తీస్తే డ్రగ్స్ సరఫరా!

Drug Peddling: కరోనా సమయంలో కూడా డ్రగ్స్ ముఠాలు కొత్త దారుల్లో సరఫరాకి దిగుతున్నాయి. ఫుడ్ డెలివరీ బాయ్స్ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ బయటపడడంతో పోలీసులే అవాక్కవుతున్నారు. ఫేమస్ ఫుడ్ డెలివరీ సంస్థలలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తూనే డ్రగ్స్ సరఫరాకు దిగిన ముగ్గురు పోలీసుల చేతికి చిక్కి జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగింది. గువాహటిలోని పల్టాన్​ బజార్​లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ భాగోతం బయటపడింది.

తనిఖీలలో భాగంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ బ్యాగ్స్ సోదాలు నిర్వహించిన పోలీసులకు నిందితుల నుంచి 13 ప్యాకెట్ల బ్రౌన్​ షుగర్​ దొరికింది. ఇందులో మొత్తం 6 గ్రాములు వరకు బ్రౌన్ షుగర్ ఉండేఅవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. నిందితులు ముగ్గురు జొమాటో, స్విగ్గీలో పనిచేస్తూ డ్రగ్స్​ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మత్తు పదార్థాల కోసం నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించిన పోలీసులు ఈ డ్రగ్స్ రాకెట్ వెనుక ముఠాను వెలికితీసే పనిలో పడ్డారు. ఫుడ్ డెలివరీ బాయ్స్ డ్రగ్స్ సరఫరా అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.