Himachal Pradesh: హిమాచల్ ఎన్నికల్లో 105 ఏళ్ల వయసులో ఓటేసిన బామ్మ

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకుంది. అది కూడా ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం ఉన్నా... తను పోలింగ్ బూత్‌కు వెళ్లి మరీ ఓటు వేయడం విశేషం.

Himachal Pradesh: హిమాచల్ ఎన్నికల్లో 105 ఏళ్ల వయసులో ఓటేసిన బామ్మ

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. శనివారం జరుగుతున్న ఈ ఎన్నికల్లో వృద్ధులు కూడా ఉత్సాహంగా ఓటేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా 105 ఏళ్ల ఒక బామ్మ తన ఓటు హక్కు వినియోగించుకుంది.

Viral Video: చెల్లికి అన్న సర్‌ప్రైజ్ గిఫ్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న చెల్లెలు.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో

నోరా దేవి అనే 105 ఏళ్ల వృద్ధురాలు చంబా జిల్లా, లదానో పోలింగ్ స్టేషన్‪లో తన ఓటు హక్కు వినియోగించుకుంది. కాగా, 80 ఏళ్లు దాటిన ఓటర్లు ఇంటి దగ్గరే బ్యాలెట్ పేపర్లలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది వృద్ధులు ఇంటి దగ్గరి నుంచే తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే, నోరా దేవి మాత్రం పోలింగ్ బూత్‪కు వెళ్లి, ఈవీఎంలోనే ఓటు వేయాలనుకుంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో వృద్ధ ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. 80 ఏళ్లు దాటిన వాళ్లే 1.2 లక్షల మంది ఉన్నారు. వీళ్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నందుకు వారికి సెల్యూట్ చేస్తున్నానని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు.

68 సీట్లున్న హిమాచల్ అసెంబ్లీకి శనివారం ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజే పూర్తి ఎన్నిక పూర్తవుతుంది. ఓట్ల లెక్కింపు వచ్చే నెలలో ఉంటుంది.