trs: టీఆర్ఎస్ స‌హా దేశంలో 13 పార్టీల భేటీ.. సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఇవాళ విచార‌ణ ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ఢిల్లీలో 13 విప‌క్ష పార్టీలు స‌మావేశ‌మ‌య్యాయి. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌కీయ స్వార్థ‌పూరిత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటుంద‌న్న విష‌యంపై చ‌ర్చించాయి.

trs: టీఆర్ఎస్ స‌హా దేశంలో 13 పార్టీల భేటీ.. సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

Congress1

trs: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేష‌న‌ల్ హెరాల్డ్ దిన‌ప‌త్రిక‌కు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఇవాళ విచార‌ణ ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ఢిల్లీలో 13 విప‌క్ష పార్టీలు స‌మావేశ‌మ‌య్యాయి. ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌కీయ స్వార్థ‌పూరిత ప్ర‌యోజ‌నాల కోసం వాడుకుంటుంద‌న్న విష‌యంపై చ‌ర్చించాయి. ఈ స‌మావేశంలో టీఆర్ఎస్ కూడా పాల్గొన‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాంగ్రెస్ నేతృత్వంలో నిర్వ‌హించిన స‌మావేశాల‌కు టీఆర్ఎస్ హాజ‌రుకాలేదు. నేటి స‌మావేశంలో మాత్రం పాల్గొంది. ఈ స‌మావేశం అనంత‌రం విప‌క్ష పార్టీలు సంయుక్తంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాయి.

”కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను మోదీ స‌ర్కారు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాడుకుంటూ విప‌క్షాల‌పై రాజకీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది. దేశంలోని ప్ర‌ముఖ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుంటూ వారిని కేంద్ర ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా వేధిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను మేము ఖండిస్తున్నాము. ప్ర‌జా, రైతు, రాజ్యాంగ‌ వ్యతిరేక విధానాల‌పై మేము పోరును ఉద్ధృతం చేస్తాము” అని విప‌క్ష పార్టీలు పేర్కొన్నాయి. కాగా, ఈ స‌మావేశంలో కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్, జ‌మ్మూక‌శ్మీర్ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్, టీఆర్ఎస్, ఎండీఎంకే, ఎన్సీపీ, వీసీకే, శివ‌సేన‌, ఆర్జేడీ నేత‌లు పాల్గొన్నారు. టీఎంసీ, ఆప్, స‌మాజ్ వాదీ పార్టీ ఈ స‌మావేశంలో పాల్గొన‌లేదు.

Maharashtra: శివ‌సేనలో చీలిక‌లు రావ‌డానికి సంజ‌య్ రౌతే కార‌ణం: రామ్‌దాస్‌ అథ‌వాలే