India vs New Zealand: ఆక్లాండ్ వన్డే.. భారీ స్కోరు సాధించిన భారత్… న్యూజిలాండ్ లక్ష్యం 307
న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

India vs New Zealand: న్యూజిలాండ్‌తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌కు తోడు, చివర్లో వాషింగ్టన్ సుందర్ విజృంభణతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.
ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి, 306 పరుగులు సాధించింది. భారత బ్యాటింగ్‌లో ముగ్గురు అర్ధ సెంచరీ సాధించడం విశేషం. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీలు సాధించి ఆకట్టుకున్నారు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. నిలకడగా ఆడుతూ మొదటి వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 50 పరుగులు సాధించిన శుభ్‌మన్ గిల్ ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే శిఖర్ ధావన్ (72) కూడా ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్ ధాటిగా ఆడుతూ 76 బంతుల్లో 80 పరుగులు సాధించి, ఇండియా భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
San Francisco: మనుషుల్ని చంపేందుకు రోబోలు.. అమెరికా పోలీసుల ప్రతిపాదన
రిషబ్ పంత్ ఎప్పట్లాగే తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా 4 పరుగులే చేసి ఔటయ్యాడు. అయితే, సంజూ శామ్సన్ నిలకడగా ఆడుతూ శ్రేయస్ అయ్యర్‌కు అండగా నిలిచాడు. తర్వాత సంజూ 38 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 16 బంతుల్లోనే 37 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉండటం విశేషం. తర్వాత శ్రేయస్ వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్ ఠాకూర్ ఒకే పరుగు చేసి, ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో 50 ఓవర్లు ముగిసే సరికి ఇండియా 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు తీశారు.