Viral News: కోడలికి 150 రకాల ఐటమ్స్‌తో అత్త విందు!

ఎంతైనా మా గోదావరి జిల్లాల వారి మర్యాదలే వేరు.. ఆయ్ అంటారు ఆ ప్రాంత వాసులు. సాధారణ రోజుల్లోనే ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండుగా రకరకాల వంటలు వడ్డించి మెప్పిస్తారని పెద్దల కాలం నుండి ఆ ప్రాంతానికి పేరున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు కొత్తగా వచ్చిన ఇంటల్లుడుకైతే ఇక ఆ మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే.

Viral News: కోడలికి 150 రకాల ఐటమ్స్‌తో అత్త విందు!

Viral News

Viral News: ఎంతైనా మా గోదావరి జిల్లాల వారి మర్యాదలే వేరు.. ఆయ్ అంటారు ఆ ప్రాంత వాసులు. సాధారణ రోజుల్లోనే ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండుగా రకరకాల వంటలు వడ్డించి మెప్పిస్తారని పెద్దల కాలం నుండి ఆ ప్రాంతానికి పేరున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు కొత్తగా వచ్చిన ఇంటల్లుడుకైతే ఇక ఆ మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. రకరకాల పిండివంటలు, నాన్ వెజ్ ప్రియులైతే మసాలా ఘుమఘుమలతో కూడిన ఐదారు రకాల వంటకాలతో ఆ మర్యాదే వేరుగా ఉంటుంది.

కొత్తగా వచ్చిన అల్లుడికే కాదు.. కొత్తగా అత్తారింటికి వచ్చిన కోడలికి.. అత్తలు, మామల పుట్టినరోజులు కోడళ్ళు కూడా కొత్తగా ఇదే తరహా సంప్రదాయానికి తెరతీస్తున్నారు. ఆ మధ్య అత్త పుట్టినరోజున ఓ కోడలు అరవై రకాల వంటలు చేసి అత్తకి కోడలు విందు భోజనం పెడితే.. ఇప్పుడు ఓ అత్త, మామ కలిసి కోడలికి ఏకంగా 150 రకాల వంటలతో విందుభోజనం ఏర్పాటు చేసి హౌరా అనిపించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తుంపూడి వెంకటకృష్ణ దంపతులు శనివారం వారి కోడలు తేజస్వి పుట్టినరోజు సందర్భంగా ఈ విందు ఇచ్చారు.

కోడలికి ఈ అత్తా, మామ ఏర్పాటు చేసిన 150 రకాలతో కూడిన విందులో 14 రకాల రైస్ ఐటమ్స్ ఉండగా 35 రకాల స్వీట్స్, మరో 35 రకాల హాట్స్ ఉన్నాయి. ఇక మరో 20 రకాలు కేక్స్ అండ్ బేక్ ఐటమ్స్ ఉండగా.. మరో ఇరవై రకాలు దేశవిదేశాలకు చెందిన చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మిగతా వంటలు కర్రీస్ వంటివి ఉన్నాయి. మొత్తంగా ఈ 150 రకాల రుచులతో కోడలికి అత్తగారింట్లో ఇచ్చిన ఈ విందు ఇప్పుడు ఉభయగోదావరి జిల్లాలలో హాట్ టాపిక్ గా మారింది.