5 years Boy order ice cream : రూ.65 వేల విలువ ఐస్‌క్రీమ్‌లు,కేకులు ఆర్డర్ చేసిన బుడ్డోడు..షాక్ అయిన తండ్రి

ఐదేళ్ల పిల్లాడు రూ.65 వేల విలువ ఐస్‌క్రీమ్‌లు,కేకులు ఆర్డర్ చేసాడు. అదిచూసి తండ్రి షాక్.. వాటన్నింటిని ఏం చేశాడంటే..

5 years Boy order ice cream : రూ.65 వేల విలువ ఐస్‌క్రీమ్‌లు,కేకులు ఆర్డర్ చేసిన బుడ్డోడు..షాక్ అయిన తండ్రి

Five Years Old Boy Order Ice Cream

five years old boy order ice cream సంవత్సరం నిండని బుజ్జాయిలు కూడా ఫోన్ లేనిది తిండి తినట్లేదు..పాలు తాగట్లేదు. ఏదోకటి ఫోన్ లో ప్లే అవుతుంటేనే తింటున్నారు తాగుతున్నారు. పెద్దవాళ్లకు ఫోన్ అలవాటు ఎంతగా ఉన్నా చిన్నారులకు మాత్రం అతకుమించి అన్నట్లుగా ఉంది. రెండేళ్లు నిండకుండానే తల్లిదండ్రుల ఫోన్లు దగ్గర పెట్టుకుని కార్టూన్లు చూస్తు గేమ్స్ ఆడేస్తున్నారు చిన్నారులు. ఆ సమయంలో పెద్దవాళ్లకు అత్యవసర ఫోన్లు వచ్చినా కాల్స్ కట్ చేసేస్తున్నారు కూడా.

అలా ఆస్ట్రేలియాలో ఓ ఐదేళ్ల పిల్లాడు తండ్రి ఫోన్‌లోని గేమ్స్ ఆడుతు ఆడుతు..ఆన్ లైన్ లో ఉబర్ ఈట్ యాప్ నుంచి ఐస్ క్రీములు, కేకులు, మిల్క్ షేకులు ఆర్డర్ చేసేశాడు పొరపాటున. అలా ఒకటి రెండు కాదు ఏకంగా ఉబర్ ఈట్ రూ.65 వేల విలువైన ఐస్‌క్రీంలు, కేక్‌లు ఆర్డ‌ర్ చేశాడు. అప్పటికే ఆ యాప్ లో ఫీడ్ అయి ఉన్న తండ్రి పనిచేసే ఆఫీసుకు వచ్చేలా కూడా క్లిక్ చేసేవాడు. మొత్తం 14 జార్ల డుల్సి డీలిచె స్ప్రెడ్, ఏడు కేకులు, ఐదు మిల్క్ బాటిళ్లు, ఆరు ఐస్‌క్రీం బాక్సుల‌ు ఆర్డ‌ర్ చేశాడ‌ు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాలో అత్యంత పాపులర్ ఐస్‌క్రీమ్ గెలాటో మెస్సినా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపింది. బాలుడు పొరపాటున ఆర్డర్ చేయడంతో అవి తండ్రి ఆఫీసులో ఉబర్ ఈట్ డెలివరీ చేసిందని వెల్లడించింది.

మీరు ఆర్డ‌ర్ చేసిన ఫుడ్ డెలివ‌రీ అయింద‌ని ఊబ‌ర్ ఈట్స్ నుంచి మెసేజ్ వ‌చ్చేంత‌వ‌ర‌కూ బాలుడి తండ్రికి ఈ విష‌యం తెలియలేదు. ఐస్ క్రీమ్‌లు, కేకులు ఆఫీస్‌లో డెలివ‌రీ కావ‌డంతో తండ్రి విస్తుపోయాడు. అది తన పుత్రరత్నంగారి ఘనకార్యం అయి ఉంటుందని తలపట్టుకున్నాడు. అగ్నిమాపక విభాగంలో ప‌నిచేసే ఆ పిల్లాడి తండ్రి చేసేదేమీ లేక అతను తన కొలిగ్స్ అవన్ని పంచిపెట్టాడు. మొత్తం బిల్లు విలువ 1,200 ఆస్ట్రేలియన్ డాలర్లు..మన కరెన్సీలో సుమారు రూ.65,220. ఆ ఆర్డర్ చేయగా వచ్చిన బిల్లు పొడవు ఆ పిల్లాడి కంటే పొడవుగా ఉంది.