T20 WORLD CUP 2022: టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. సెమీస్ చేరిన ఇంగ్లండ్

టీ20 వరల్డ్ కప్ నుంచి ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా నిష్క్రమించింది. శనివారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా ఆ జట్టు సెమీ ఫైనల్ చేరింది. రన్ రేట్ తక్కువగా ఉన్న కారణంతో ఆస్ట్రేలియా సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది.

T20 WORLD CUP 2022: టీ20 వరల్డ్ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. సెమీస్ చేరిన ఇంగ్లండ్

T20 WORLD CUP 2022: టీ20 వరల్డ్ కప్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా ఈ వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్ జట్టు సెమీస్ చేరింది. సూపర్-12 దశలోనే ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించింది.

Hyderabad: మేడ్చల్ జిల్లాలో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి… అందరూ అంబర్‌పేట వాసులే!

ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్ ఏడు పాయింట్లు సాధించింది. అయితే, ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లతోనే ఉన్నప్పటికీ, ఇంగ్లండ్ రన్‌రేట్ ఎక్కువగా ఉంది. దీంతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరుకుంది. గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఇప్పటికే సెమీస్ చేరిన న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఇక గ్రూప్-2 నుంచి ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇండియా, సౌతాఫ్రికా సెమీస్ చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో ప్రతి జట్టు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, వీటిలో నెదర్లాండ్స్ ఇప్పటికే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లకు కూడా అవకాశం లేదు. అయితే, పాకిస్తాన్‌కు మాత్రం అవకాశం ఉంది. అదీ అద్భుతాలు జరిగితేనే.

Elon Musk: ఇండియన్ ఉద్యోగులకు ఎలన్ మస్క్ షాక్.. భారీ సంఖ్యలో భారతీయుల తొలగింపు

ఇండియా, సౌతాఫ్రికా జట్లు జింబాబ్వే, నెదర్లాండ్స్ జట్లతో తలపడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లోనూ ఇటు ఇండియా, అటు సౌతాఫ్రికా ఈజీగా విజయం సాధిస్తాయి. దీంతో ఈ రెండు జట్లే సెమీస్‌కు వెళ్తాయి. ఒకవేళ ఈ రెండు జట్లలో ఏదైనా జట్టు ఓడిపోతే సమీకరణాలు మారిపోవచ్చు. అప్పుడు అనూహ్యంగా పాక్ కూడా రేసులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఇందుకు అవకాశం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే పాక్ సెమీస్ చేరాలంటే జింబాబ్వే చేతిలో ఇండియా ఓడిపోవడమో లేక నెదర్లాండ్స్ చేతిలో సౌతాఫ్రికా ఓడి పోవడమే జరగాలి. అలాగే బంగ్లాదేశ్‌పై పాక్ భారీ తేడాతో విజయం సాధించాలి. ఈ మూడింట్లో ఏది జరగకపోయినా పాక్‌కు ఛాన్స్ లేదు. దీంతో ఇండియా, సౌతాఫ్రికా జట్లకే సెమీస్ చేరే అవకాశాలున్నాయి.