Maharashtra: మెర్సిడెస్ కారును ఆటో రిక్షా వెనకేసింది: ఉద్ధవ్‌కు సీఎం ఏక్‌నాథ్ షిండే కౌంట‌ర్

''మెర్సిడెస్ కారు కంటే వేగంగా ఆటోరిక్షా దూసుకెళ్ళింది. ఎందుకంటే ఇది సామాన్య ప్ర‌జ‌ల కోసం ఏర్ప‌డిన ప్ర‌భుత్వం. మాది ప్ర‌తి వ‌ర్గానికి న్యాయం చేసే స‌ర్కారు. ఇది నా ప్ర‌భుత్వం అని ప్ర‌తి ఒక్క‌రూ చెప్పుకునేలా మేము పాల‌న కొన‌సాగిస్తాం''అని ఏక్‌నాథ్ షిండే అన్నారు.

Maharashtra: మెర్సిడెస్ కారును ఆటో రిక్షా వెనకేసింది: ఉద్ధవ్‌కు సీఎం ఏక్‌నాథ్ షిండే కౌంట‌ర్

Eknath Shinde..maharashtra's Politics

Maharashtra: ‘మెర్సిడెస్ కారును ఆటో రిక్షా  వెనకేసింది’ అంటూ మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రేకు ఆ రాష్ట్ర సీఎం, శివ‌సేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే కౌంట‌ర్ ఇచ్చారు. ఉద్ధ‌వ్ ఠాక్రే నిన్న మీడియాతో మాట్లాడుతూ త‌న‌పై చేసిన విమ‌ర్శ‌లను ఏక్‌నాథ్ తిప్పికొట్టారు. ”మ‌హారాష్ట్రలో మ‌హా వికాస్ అఘాడీ ప్ర‌భుత్వం ఉన్న స‌మ‌యంలో శివ‌సేన‌-ఎన్సీపీ-కాంగ్రెస్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు చేసింది. మ‌హా వికాస్ అఘాడీ మూడు చ‌క్రాల ప్ర‌భుత్వం అని బీజేపీ ఎద్దేవా చేసింది. ఇప్పుడేమో మూడు చ‌క్రాల బండిని న‌డిపిన వ్య‌క్తే ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నాడు” అని ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ఉద్ధ‌వ్ ఠాక్రే అన్నారు. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఏక్‌నాథ్ షిండే ఆటో రిక్షా న‌డిపిన రోజుల‌ను గుర్తు చేస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Telangana: నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం

దీనిపై ఏక్‌నాథ్ షిండే ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ”మెర్సిడెస్ కారు కంటే వేగంగా ఆటోరిక్షా దూసుకెళ్ళింది. ఎందుకంటే ఇది సామాన్య ప్ర‌జ‌ల కోసం ఏర్ప‌డిన ప్ర‌భుత్వం. మాది ప్ర‌తి వ‌ర్గానికి న్యాయం చేసే స‌ర్కారు. ఇది నా ప్ర‌భుత్వం అని ప్ర‌తి ఒక్క‌రూ చెప్పుకునేలా మేము పాల‌న కొన‌సాగిస్తాం. అదే నా విధి. మా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటుంది. అధికారం కోసం బీజేపీ ఏదైనా చేస్తుంద‌ని ప్ర‌జ‌ల్లో అనుమానాలు ఉన్నాయి. ఈ విష‌యాన్ని మేము ముందుగానే గ్ర‌హించాం” అని షిండే చెప్పారు.

Enforcement Directorate: మ‌నీలాండ‌రింగ్ కేసు.. ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ అనుచ‌రులు ఇద్ద‌రు అరెస్టు

”నా వైపు ఉన్న 50 మంది ఎమ్మెల్యేలు అభివృద్ధికి, హిందుత్వానికి, ప‌లు సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి ఉన్నారు. అందుకే బీజేపీ మ‌ద్ద‌తు తెలిపింది. మా కంటే అధికమంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ మాకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇచ్చారు అని షిండే తెలిపారు. అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకెళ్ళాల‌ని ప్ర‌ధాని మోదీ నాకు చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా మాతోనే ఉంది. మేము ఎటువంటి చ‌ట్ట‌విరుద్ధ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌లేదు. గ‌త ఎన్నిక‌ల ముందు కూడా బీజేపీ-శివ‌సేన మిత్ర‌త్వాన్ని కొన‌సాగించాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 200కు పైగా సీట్లు గెలుచుకుంటాం” అని షిండే అన్నారు.