Avatar 2: అవతార్-2 టార్గెట్ ఎంతో తెలుసా.. నోరెళ్లబెట్టాల్సిందే!

హాలీవుడ్‌లో విజువల్ వండర్ మూవీగా తెరకెక్కుతున్న ‘అవతార్-2’ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Avatar 2: అవతార్-2 టార్గెట్ ఎంతో తెలుసా.. నోరెళ్లబెట్టాల్సిందే!

Avatar 2 Break Even Amount Will Stun You

Avatar 2: హాలీవుడ్‌లో విజువల్ వండర్ మూవీగా తెరకెక్కుతున్న ‘అవతార్-2’ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో వచ్చిన ‘అవతార్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న అవతార్-2 మూవీ కోసం యావత్ ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Avatar 2 : అవతార్-2 కొత్త ట్రైలర్ వచ్చేసింది.. విజువల్ వండర్!

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన అవతార్-2 చిత్ర టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ కూడా ఆద్యంతం విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే థియేట్రికల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

Avatar 2: అవతార్ 2 హిట్ అయితేనే.. లేకపోతే మర్చిపోండి అంటోన్న జేమ్స్ కామెరాన్!

అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2.2 బిలియన్ డాలర్లు వసూళ్లు సాధిస్తే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుందని అవతార్-2 చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో ఓ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం ఓ రికార్డు అని హాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే గతంలో వచ్చిన అవతార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.2.9 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. దీంతో ఇప్పుడు అవతార్-2 పై ఉన్న అంచనాలనే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ ఈ స్థాయిలో జరిగేందుకు కారణంగా మారాయని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి అవతార్-2 మూవీ రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.