చలి..చలి : మద్యం తాగకండి, జాగ్రత్తగా ఉండండి – IMD సూచన

చలి..చలి : మద్యం తాగకండి, జాగ్రత్తగా ఉండండి – IMD సూచన

Avoid alcohol, says IMD as ‘severe’ cold wave : అబ్బా..చలి ఎక్కువగా ఉంది..ఓ పెగ్గు వేస్తే…ఎంత మంచిగా ఉంటుందో..అని అనుకుంటున్నారా…అలాంటి పనులు అస్సలు చేయకుండి అంటోంది IMD. ఎందుకంటే శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ఫలితంగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ప్రధానంగా ఉత్తర భారత వాసులు జాగ్రత్తగా ఉండాలని, రానున్న నూతన సంవత్సరంలో మద్యం తాగకపోవడమే మచిందని తెలిపింది. ఈ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంటుందని, పంజాబ్, హర్యాణా, ఢిల్లీ, యూపీ, నార్త్ రాజస్థాన్ రాష్ట్రాల్లో డిసెంబర్ 28వ తేదీ నుంచి తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని భావిస్తున్నట్లు IMD అధికారులు వెల్లడించారు.

జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ ప్రాంతాల్లో మంచు వర్షం కురిసే ఛాన్స్ ఉందని, హిమాలయాల నుంచి వీచే చల్లని గాలులతో ఉత్తర భారతంలో టెంపరేచర్స్ ఐదు నుంచి మూడు డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచిస్తున్నారు.  చలిగాలులు అధికంగా వీయడం వల్ల..ఫ్లూ, ముక్కు కారడం వంటివి సంభవిస్తాయని, దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.

ఇలాంటి పరిస్థితుల్లో మద్యం సేవించడం వల్ల…శరీర ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గి…ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి. విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారా పదార్థాలు తీసుకోవాలని సూచించారు. విటమిన్ సి (Vitamin C)పుష్కలంగా ఉండే ఫ్రూట్స్ తినాలని, చలి తీవ్రతకు శరీరం పాడు కాకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్లు వాడాలని తెలిపారు.