మూడవ టెస్ట్‌లో భారత్ ఆధిపత్యం.. ఇంగ్లాండ్ ఆలౌట్!

మూడవ టెస్ట్‌లో భారత్ ఆధిపత్యం.. ఇంగ్లాండ్ ఆలౌట్!

పింక్‌ బాల్‌ టెస్ట్‌లో ఫస్ట్ డే.. భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 48.4 ఓవర్లలోనే 112పరుగులకు ఆలౌట్‌ అయింది. మొదటి సెషన్‌ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ సిబ్లీని డకౌట్‌ చేసిన ఇషాంత్‌ టీమిండియాకు శుభారంభం అందించగా.. అక్షర్‌ పటేల్‌ ఇంగ్లాండ్ ఆటగాళ్లను క్రీజులో నిలదొక్కుకోనివ్వలేదు..

టీమిండియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ 38 పరుగులకే ఆరు వికెట్లు తీసి టెస్టు కెరీర్‌లో‌ అత్యుత్తమ గణాంకాలతో సత్తా చాటాడు. బెయిర్‌ స్టో సున్నా పరుగులకే ఔట్‌ అవ్వగా.. ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత రూట్‌, క్రావ్లేలు కలిసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే మొదటి సెషన్‌ విరామానికి ముందు ఇంగ్లండ్‌ వరుసగా రూట్‌ , క్రావ్లే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

తర్వాత సెషన్‌లో కూడా ఇంగ్లాండ్ జట్టు ఏ మాత్రం కుదురుకోలేదు. టీమిండియా బౌలర్ల ఉచ్చులో పడిన ఇంగ్లండ్‌.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ఐదవ వికెట్‌గా 81పరుగుల వద్ద పోప్ వికెట్ పడిపోగా.. అక్షర్‌ పటేల్‌ వేసిన 28వ ఓవర్‌ 5వ బంతికి స్టోక్స్‌ ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ 81 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్‌ 3, ఇషాంత్‌ ఒక వికెట్‌ తీశాడు.