NELLORE : కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?

కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?

NELLORE : కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?

Corona Medicine

Ayurveda : కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ? ఈ మందుతో ఐసోలేషన్ కేంద్రాలు, ఆక్సిజన్ తంటాలు అవసరం లేదా ? నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనాకు ఇస్తున్న ఆయుర్వేదం మెడిసన్ లో ఏముంది ? అధికారులు మెడిసిన్ రిపోర్టు కోసం ఎందుకు ఆసక్తగా ఎదురు చూస్తున్నారు ?

తిప్పతీగ, ఉసిరి, జిల్లేడు ప్రకృతి వనమూలికలతో ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. ఈ మందుతో కరోనా రోగులు పూర్తిగా కోలుకుంటున్నారని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవని చెబుతున్నారు. ఈ మందు వాడిన తర్వాత త్వరగానే కోలుకున్నామని కరోనా రోగులు వెల్లడిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.

అధికారులు ఈ మందు గురించి ఆరా తీస్తున్నారు. ఆయుర్వేద మందు పని తీరును తెలుసుకొనేందుకు ఆనందయ్యను జీజీహెచ్ ఆసుపత్రికి పిలిపించుకున్నారు. జిల్లా వైద్యాధికారి రాజ్యలక్ష్మి, ఆయుష్ వైద్యాధికారులతో కలిసి ఆనందయ్య జీజీహెచ్ హాస్పిటల్ కు వచ్చారు. కోవిడ్ బాధితులకు మందు ఇవ్వాలని అడిగేందుకు ఆనందయ్యను పిలిపించినట్లు సమాచారం. కానీ..ఆ మందులను ఇవ్వకుండానే ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం.

అంతకుముందు ఆనందయ్యతో మాట్లాడిన అధికారులు అనంతరం..తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. విజయవాడ నుంచి ఈ ఆయుర్వేద మందుపై రిపోర్టు వచ్చిన తర్వాతే..మందు తీసుకోవాలని వేచి చూసే ధోరణిలో ఉన్నారు అధికారులు.

కృష్ణపట్నంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఉచితంగా మందును పంపిణీ చేస్తున్నాడు. ఈ మందు తీసుకున్న తర్వాత..కరోనా నయం అయ్యిందనే ప్రచారంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆయుర్వేదంతో కరోనా నివారణ అంటూ చెబుతున్నారు.

Read More : AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ముందే మొదలైన రగడ