కరోనాకి పతంజలి ఆయుర్వేద మందు, విడుదల చేసిన రాందేవ్ బాబా.. వేటితో తయారు చేశారంటే..

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా

కరోనాకి పతంజలి ఆయుర్వేద మందు, విడుదల చేసిన రాందేవ్ బాబా.. వేటితో తయారు చేశారంటే..

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మెడిసిన్ కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో కరోనా వైరస్ మహమ్మారికి తాము ఆయుర్వేద మెడిసిన్ కనుగొన్నట్టుగా ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మెడిసిన్ ను బాబా రాందేవ్ చేతుల మీదుగా మార్కెట్ లోకి విడుదల చేశారు. ‘కరోనిల్’(Coronil) పేరుతో తయారు చేసిన కరోనా ఔషదాన్ని మంగళవారం(జూన్ 23,2020) మధ్యాహ్నం 12 గంటలకు హరిద్వార్ లోని యోగా పీఠ్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ మెడిసిన్ కు సంబంధించిన శాస్త్రీయ వివరాలను కూడా మీడియాకు తెలిపారు.

కరోనిల్ తో కరోనా నయం:
తమ సంస్థ తయారుచేసిన ఔషధం కోవిడ్-19కు చికిత్సలో ఉపయోగపడుతుందని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ అన్నారు. కరోనాకు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్‌ను తాము తయారుచేసిన దివ్య కరోనిల్ సమర్ధంగా ఎదుర్కొంటుందని పరిశోధనలతో తేలిందన్నారు. ప్రాణాంతక కోవిడ్ అంటువ్యాధికి ఇతర సంస్థల కంటే ముందుగా సాక్ష్యం ఆధారిత ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసి ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉందన్నారు ఆచార్య బాలకృష్ణ అన్నారు.

అశ్వగంధ, గిలోయ్, తులసి కలిపి ఔషధం తయారీ:
అశ్వగంధ, గిలోయ్, తులసితో కలిపి చేసిన కరోనిల్‌ ఔషధాన్నికరోనా బాధితులకు చికిత్సలో వినియోగించినప్పుడు 100 శాతం మంది కోలుకున్నారని బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంయుక్తంగా రూపొందించినట్టు వెల్లడించారు. క్లినికల్ ట్రయల్స్ కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ మందును తీసుకొచ్చామని ఆయన వివరించారు. మూడు రోజుల్లో ఈ మందుతో చాలా మంది కోలుకున్నారని చెప్పారు. ఈ మందును తీసుకురావడంలో కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలిపారు. హరిద్వార్‌లోని దివ్వ ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ప్రస్తుతం ఈ మందు ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు.

4 నుంచి 15 రోజుల్లో కరోనా నయం:
కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చని తాము విశ్వసిస్తున్నామని.. దీనికి సంబంధించిన మెడిసిన్‌ కూడా రెడీ చేసి.. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు ఇటీవలే బాలక్రిష్ణ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని గత వారం రోజుల క్రితమే తెలిపారు. తాము చేసిన ఆయుర్వేద మెడిసిన్‌తో కరోనా రోగి.. 4 నుంచి 15 రోజుల్లో కోలుకున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో రుజువైందని ఇప్పటికే బాలక్రిష్ణ తెలిపారు. మొత్తానికి ఈ మెడిసిన్‌ కనుక కరోనాను నయం చేసేది అయితే ఆయుర్వేదంలో కనుగొన్న తొలి ఔషధం ఇదే కానుంది.