Babul Supriyo : రాజకీయాలకు బాబుల్‌ సుప్రియో గుడ్‌బై

బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమాజ సేవకు రాజకీయాలు అడ్డంకిగా ఉన్నాయని ఆయన తెలిపారు. తాను ఏ పార్టీలో చేరనని వివరించారు.

Babul Supriyo : రాజకీయాలకు బాబుల్‌ సుప్రియో గుడ్‌బై

Babul Supriyo

Babul Supriyo : కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్‌బై చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇకపై సమాజ సేవ మాత్రమే చేస్తానని.. ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఇటీవల చేపట్టిన కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆయనతో పాటు చాలా మంది నేతలకు ఉద్వాసన పలికారు. ఇదే కారణం కావచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుప్రియోల్ 2014లో బీజేపీలో చేరారు.

పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా ఎంపీ అయిన బాబుల్ కి కేంద్ర సహాయమంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ, 2019 ఎన్నికల్లో రెండవసారి లోక్ సభను ఎన్నికయ్యారు బాబుల్.. ఇక తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగారు సుప్రియో టీఎంసీ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఓటమి చవిచూశారు.

అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవి కోల్పోయారు.. రాజకీయంగా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాను మాత్రం సమాజసేవ చేసేందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో సమాజసేవ చేయలేకపోతున్నానని తెలిపారు సుప్రియో. ఇప్పుడిప్పుడే పశ్చిమ బెంగాల్ లో పుంజుకుంటున్న బీజేపీకి సుప్రియో రాజీనామా గట్టి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.