బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ అంటున్న ‘రాబర్ట్’..

బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ అంటున్న ‘రాబర్ట్’..

Baby Dance Floor Ready: పాపులర్ యాక్టర్, ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ ‘రాబర్ట్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో దర్శన్ నటించిన ‘రాబర్ట్’ మూవీ తొలిసారి తెలుగులో విడుదలవుతోంది.. సెకండ్ ఇన్నింగ్స్‌లో స్పీడ్ పెంచిన సీనియర్ హీరో జగపతిబాబు కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో ఆశా భట్ కథానాయికగా నటించింది.

Roberrt

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శన్ క్రేజ్ చూసి టాలీవుడ్ సినీ వర్గాలవారు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.. తరుణ్ కిషోర్ సుధీర్ దర్శకత్వంలో ఉమాపతి ఫిల్మ్స్ బ్యానర్ మీద ఉమాపతి శ్రీనివాస గౌడ నిర్మిస్తున్న ‘రాబర్ట్’ మూవీలోనుండి ‘బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కాస్ట్యూమ్స్, లిరిక్స్, డ్యాన్స్ మూమెంట్స్, సెట్స్ అన్నీ సాంగ్‌కి పర్ఫెక్ట్‌గా కుదిరాయి.. దర్శన్ పాటలో కూడా రెండు డిఫరెంట్ గెటప్స్‌లో స్టైలిష్‌గా కనిపించి ఆకట్టుకున్నాడు.. మార్చి 11న ‘రాబర్ట్’ కన్నడ, తెలుగు భాషల్లో భారీగా విడుదల కానుంది..