Baby Kidnap: చిన్నారి కిడ్నాప్ కేసులో విచారణ వేగవంతం

విజయవాడలో మూడేళ్ల చిన్నారి షఫీదా కిడ్నాప్ కేసులో రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Baby Kidnap: చిన్నారి కిడ్నాప్ కేసులో విచారణ వేగవంతం

Baby Kidnap

Baby Kidnap: విజయవాడలో మూడేళ్ల చిన్నారి షఫీదా కిడ్నాప్ కేసులో రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్ నుంచి పాపను కిడ్నాపర్ నెహ్రూ బొమ్మ సెంటర్ కొండ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చిట్టి నగర్, పంజా సెంటర్, వాగు సెంటర్, పాల ఫ్యాక్టరీ, సితార సెంటర్ వంటి ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Jubilee Hills Rape Case: పోలీసు కస్టడీలో నేడు నిందితుల విచారణ

సీసీ టీవీ ఫుటేజ్‌లో ఉన్న కిడ్నాపర్ చిత్రాలను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు పంపారు. గతంలో కిడ్నాపర్ ఎక్కడైనా చిన్నారులను కిడ్నాప్ చేసిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. తమ చిన్నారి కోసం ఎదురు చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పనికివెళ్లి వచ్చి నిద్ర పోతున్న సమయంలో ఇద్దరు మహిళలు తమ కూతురును ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు చెప్పారు. కిడ్నాప్ చేసిన వారిని గుర్తుపట్టాలని పోలీసులు అడిగారని, అయితే, కిడ్నాపర్లు ఎవరో తమకు తెలియదని వారు అంటున్నారు. తమ కుమార్తెను ఎలాగైనా తమకు అప్పగించాలని కోరుతున్నారు..