Viral Video: ఈ బుజ్జిదాని ర్యాంప్‌వాక్‌కు నెటిజన్లు ఫిదా!

ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మోడళ్ళు ర్యాంప్ వాక్ చాలా సాధారణమైపోయింది. బట్టల దగ్గర నుండి.. చెప్పుల వరకు మోడళ్లతో తమ ఉత్పత్తులను మార్కెటింగ్

Viral Video: ఈ బుజ్జిదాని ర్యాంప్‌వాక్‌కు నెటిజన్లు ఫిదా!

Viral Video

Viral Video: ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మోడళ్ళు ర్యాంప్ వాక్ చాలా సాధారణమైపోయింది. బట్టల దగ్గర నుండి.. చెప్పుల వరకు మోడళ్లతో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడం ఈ వ్యాపార సమాజంలో అత్యంత సహజం. అందమైన మోడళ్ళు ర్యాంప్ మీద నడుస్తుంటే.. పక్కన ఆ జిగేల్ మనిపించే లైట్లు, మోడళ్ల వాకింగ్ ను కొలిచేందుకు ఎదురుగా జడ్జీలు అదంతా ఓ సెటప్. కాగా, ఈమధ్య కాలంలో పెంపుడు జంతువులతో కూడా ర్యాంప్ వాక్ చేయిస్తున్న ఘటనలు కూడా మనం చూస్తున్నాం.

అయితే, ఓ చిన్నారి మోడళ్లను తలదన్నేలా ర్యాంప్ వాక్ చేయడం మీరు చూశారా. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ తెగ వైరల్ అవుతుంది. అబ్రియానా అనే ఓ చిన్నారి పింక్ గౌన్ ధరించి ర్యాంప్ మీద హొయలు పోతూ వాక్ చేయడం.. మోడళ్ల తరహాలోనే తన డ్రెస్ ప్రదర్శించడం.. పైగా ప్రొఫెషనల్ మోడళ్ల వాకింగ్ లో ఉండే మెరుపులు, విరుపులు అబ్బో అన్నీ ఈ బుజ్జిదాని వాకింగ్ లో చూపించేసింది.

చూసేందుకు ముద్దుముద్దుగా ఉంటూనే ఓ ప్రొఫెషనల్ మోడల్ ను తలపించేలా వాకింగ్ చేసిన ఈ చిన్నారి వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. చిన్నారి ఈ క్యూట్ వాకింగ్ ను ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించి తెగ పొగిడేస్తున్నారు. ఒక్క టిక్‌టాక్‌లో 18 మిలియన్ వ్యూస్ సాధించిన ఈ వీడియో ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి రకరకాల సోషల్ మీడియా సైట్లలో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Kristen Weaver (@kristenweaverstudio)