మరో తల్లికి కడుపుకోత..కడుపులోనే చనిపోయిన బిడ్డ

  • Published By: madhu ,Published On : May 9, 2020 / 02:33 AM IST
మరో తల్లికి కడుపుకోత..కడుపులోనే చనిపోయిన బిడ్డ

కరోనా వేళ గర్భిణీల కష్టాలు అంతాఇంత కాదు. గర్భిణీల ఆరోగ్యం విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. డెలివరీకు ఐదు రోజుల ముందే ఆస్పత్రిలో చేరాలని సూచిస్తున్నాయి. కానీ విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రుల చుట్టూ తిరిగి..తల్లీబిడ్డలు చనిపోయిన ఘటన మరవకముందే..మరో విషాదం చోటు చేసుకుంది. తల్లి కడుపులోనే బిడ్డ చనిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. 

ఇటిక్యాల మండలం కొండపేటకు చెందిన జ్యోతి రెండోసారి గర్భం దాల్చింది. కాన్పు నిమిత్తం..వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళితే..వైద్యులు చేర్చుకోలేదని కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ దగ్గరకు జ్యోతి..పేరిట గర్భిణీ ఎవరు రాలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న జ్యోతికి 2020, మే 08వ తేదీ శుక్రవారం తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. 

108 వాహనంలో గద్వాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలో జ్యోతికి బీపీ ఎక్కువ కావడం..ప్లేట్ లెట్స్ పడిపోవడం, నొప్పి ఎక్కువ కావడాన్ని గుర్తించారు. వెంటనే స్కానింగ్ చేయగా..కడుపులో బిడ్డకు ప్రాణం లేదని తెలుసుకున్నారు. సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు హైదరాబాద్ లోని ప్లేట్లబురుజు ఆసుపత్రికి రిఫర్ చేశారు. 

ఆపరేషన్ చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ప్లేట్ లెట్స్ పడిపోయాయని, కడుపులో బిడ్డ అంతకుముందే చనిపోయిందని గద్వాల ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. గర్భిణీ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు పంపించామన్నారు. 

Read More :

రాత్రికి రాత్రే తొమ్మిది నెలల గర్భం మాయం

వైరస్ లక్షణాలు లేకున్నా గర్భిణులకు కరోనా పరీక్షలు, ప్రభుత్వం కీలక నిర్ణయం