Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుంటే!

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్ధాయిలను తెలుసుకునేందుకు సాధారణంగా వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించి తద్వారా దానిని పరిమాణాన్ని నిర్ధారించుకుంటారు. అయితే కొన్ని సంకేతాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని నిర్ధారణకు రావచ్చని నిపుణులు చెబుతన్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం నీలం రంగులోకి మారుతుంది.

Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతుంటే!

Bad Cholesterol

Bad Cholesterol : జీవనశైలిలో మార్పులతో నేటి తరం చాలా మంది చెడు కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. గుండె సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతున్నట్లు నిపుణులు అంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం అంటూ గంటల సమయం గడిపేస్తున్నారు. ఈ బిజీ లైఫ్‌ స్టైల్‌ వల్ల కొందరు వ్యాయామానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. నూనెతో కూడిన ఆహార పదార్థాలు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ను పెంచుతుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు, మధుమేహం, హైపర్‌టెన్షన్‌‌, గుండెపోటుకు దారితీస్తుంది. కొన్ని సంకేతాల ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని గుర్తించవచ్చు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్ధాయిలను తెలుసుకునేందుకు సాధారణంగా వైద్యులు కొన్ని పరీక్షలు నిర్వహించి తద్వారా దానిని పరిమాణాన్ని నిర్ధారించుకుంటారు. అయితే కొన్ని సంకేతాల ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందని నిర్ధారణకు రావచ్చని నిపుణులు చెబుతన్నారు. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చర్మం నీలం రంగులోకి మారుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు మన పాదాలలో నొప్పి పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ కారణంగా మన శరీరంలోని నరాలకు రక్త ప్రసరణ సరిగా ఉండదు. పాదాలలో నొప్పి వస్తుంది. చెడు కొలస్ట్రాల్ పెరిగితే.. పాదాలపై పొట్టు కూడా క్రమంగా తొలగిపోవటంతోపాటు పొక్కులు కూడా వస్తాయి.

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువగా ఉంటే పాదాలు, గోర్లు రంగు మారతాయి. క్రమేపి పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. పాదాలకు రక్త సరఫరా సరిగా జరగదు. రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు చాలా సార్లు కాళ్ళలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. తిమ్మిర్లు వస్తాయి. వేసవి ఉష్ణోగ్రతలో కూడా పాదాలు అకస్మాత్తుగా చల్లగా మారితే శరీరంలో కొలెస్ట్రాల్ ఉన్నట్లుగా భావించాలి. కళ్లలో మార్పులు వస్తాయి. కళ్లు పసుపు లేదా నారింజ రంగులోకి మారితే కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని సంకేతాలుగా భావించవచ్చు.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించటం మంచిది. వారిచ్చే సూచనలు, సలహాల ద్వారా తగిన చికిత్స పొందవచ్చు.