Badrinath : బన్నీ ‘బద్రీనాథ్’ కు పదేళ్లు..

2021 జూన్ 10 నాటికి ‘బద్రీనాథ్’ సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి..

Badrinath : బన్నీ ‘బద్రీనాథ్’ కు పదేళ్లు..

Badrinath Movie Completes 10 Years

Badrinath: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా.. మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో, బిగ్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ఏస్ ప్రొడ్యూసర్ నిర్మించిన భారీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బద్రీనాథ్’.. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘బద్రీనాథ్’ 2011 జూన్ 10న విడుదలైంది.

2021 జూన్ 10 నాటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తవుతున్నాయి.. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. చిన్ని కృష్ణ కథ అందించిన ఈ మూవీలో ‘బద్రీనాథ్’ ఆలయాన్ని సంరక్షించే ద్వార పాలకుడిగా బన్నీ నటన ఆకట్టుకుంటుంది.

తమన్నా గ్లామర్‌తో పాటు యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది. ప్రకాష్ రాజ్, కెల్లీ డోర్జీ, అశ్వినీ కల్సేకర్ క్యారెక్టర్లు సినిమాకు హైలెట్ అయ్యాయి.. స్వరవాణి ఎం.ఎం. కీరవాణి పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, రవి వర్మన్ విజువల్స్ ‘బద్రీనాథ్’ సినిమాకు మెయిన్ పిల్లర్స్‌గా నిలిచాయి..