#NBK107: అధికారిక ప్రకటన.. అభిమానులకు నటసింహ అదిరిపోయే గిఫ్ట్!

ప్రస్తుతం దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారైందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

#NBK107: అధికారిక ప్రకటన.. అభిమానులకు నటసింహ అదిరిపోయే గిఫ్ట్!

Nbk107

#NBK107: ప్రస్తుతం దర్శకుడు బోయపాటితో కలిసి హ్యాట్రిక్ హిట్ కోసం చూస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ వరస సినిమాలను ఒకే చేస్తున్నారు. అఖండ షూటింగ్ లో ఉండగానే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా ఖరారైందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ ఈ విషయాన్ని ఎప్పుడో ప్రకటించగా తాజాగా దీనిపై నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

కాగా ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై నందమూరి అభిమానులకు నటసింహ బాలయ్య నుండి సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ వచ్చేసింది. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. క్రాక్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ మైత్రి మూవీ మేకర్స్ ఓ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. త్వరలోనే వేట మొదలు కానుంది అంటూ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. బాలయ్య కెరీర్ లో ఇది 107వ సినిమా కాగా బాలయ్యను గోపీచంద్ ఎలా చూపించనున్నాడా అని అభిమానులలో ఆసక్తి నెలకొంది. ఇందులో బాలయ్య పక్కా మాస్‌ లుక్‌లో సందడి చేసే అవకాశాలున్నట్లు సమాచారం.