Balayya : బాలయ్యతో ‘పటాస్’ లాంటి సినిమా.. బొమ్మ బ్లాక్ బస్టర్..

నటసింహ నందమూరి బాలకృష్ణతో మల్టీస్టారర్ ప్రాజెక్ట్.. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఫుల్ మాస్ మూవీ.. మాస్ మహారాజ రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్... ఇలా ‘ఎఫ్ 3’ తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమా ఇదేనంటూ బోలెడు వార్తలొచ్చాయి..

Balayya : బాలయ్యతో ‘పటాస్’ లాంటి సినిమా.. బొమ్మ బ్లాక్ బస్టర్..

Balayya

Balayya: నటసింహ నందమూరి బాలకృష్ణతో మల్టీస్టారర్ ప్రాజెక్ట్.. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఫుల్ మాస్ మూవీ.. మాస్ మహారాజ రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్… ఇలా ‘ఎఫ్ 3’ తర్వాత బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమా ఇదేనంటూ బోలెడు వార్తలొచ్చాయి. అయితే వీటన్నింటిపై ఓ క్లారిటీ ఇచ్చారు ఈ స్టార్ డైరెక్టర్. ఇంతకీ అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా పట్టాలెక్కబోయేది ఏ హీరోతో..? ఆ మూడు సినిమాల అసలు మ్యాటరేంటి..?..

ఒక డైరెక్టర్ – మూడు సినిమాలు. అవును ‘ఎఫ్ 3’ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి మూడు సినిమాలను లైన్లో పెట్టారు. ఈమధ్యే కోవిడ్ 19 నుంచి కోలుకున్న అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు ఉత్సాహానిచ్చే వార్తను చెప్పి ట్రెండ్ అవుతున్నారు. ముందు నుంచి అనుకున్నట్టే బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజలతో మూడు సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే ముందు ఏ సినిమా పట్టాలెక్కుందనే విషయం మాత్రం ‘ఎఫ్ 3’ పోస్ట్ ప్రొడక్షన్ అయ్యాకే అనౌన్స్ చేస్తానని ట్విస్ట్ ఇచ్చారు.

Anil Ravipudi : బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌కి భలే చిక్కొచ్చి పడిందే.. ముగ్గురిలో ఎవరితో సినిమా?..

‘ఎఫ్ 3’ ఇంకా యాభై రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేసినా 50 రోజుల్లోనే ‘ఎఫ్ 3’ బ్యాలెన్స్ కంప్లీటవుతుందనే ధీమాతో ఉన్నారు అనిల్. అటు బాలకృష్ణతో ‘పటాస్’ లాంటి సినిమాను ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య – అనిల్ రావిపూడి కాంబో మూవీకి ప్రెజెంట్ స్క్రిప్ట్ రెడీ అయింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది. అంతా అనుకుంటున్నట్లు మాత్రం ఇది మల్టీ స్టారర్ కాదు. అంటే బాలయ్య – కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ సినిమా ఉంటుందనే ప్రచారంలో నిజం లేదు.

నిజానికి ‘ఎఫ్ 3’ తర్వాత సూపర్ స్టార్ కాంబోలో అనిల్ సినిమా చేయాల్సి ఉంది. దానికి స్టోరీ కూడా ఓకే అయింది. కానీ అనుకోకుండా త్రివిక్రమ్ మూవీ ముందుకు రావడంతో అనిల్ సైడయ్యారు. త్రివిక్రమ్, రాజమౌళి ప్రాజెక్ట్స్ తర్వాతే మహేష్‌‌తో అనిల్ రెండో సినిమా ఉండబోతోంది. మరోవైపు రవితేజతో ‘రాజా ది గ్రేట్’ సీక్వెల్‌కు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్టోరీకి ఇంకా టైం పట్టేలా ఉంది. కాబట్టి ‘ఎఫ్ 3’ తర్వాత బాలయ్యతోనే అనిల్ సినిమా సెట్స్‌పైకెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది..