Balakrishna Upcoming Film: మళ్ళీ వేటపాలెంలో వేట మొదలెట్టిన దర్శకుడు!

ఈ మధ్యకాలంలో మేకర్స్ వారి వారి సొంత ప్రాంతాలను హైలెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కించడం ఆనవాయితీగా మారింది. ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు సినిమాలే అందుకు ఉదాహరణ. చిన్న సినిమాగా మొదలై భారీ సక్సెస్ కొట్టిన జాతి రత్నాలు సినిమాలో జోగిపేట-సంగారెడ్డి పేర్లను హైలెట్ చేశారు. ఇక గోపిచంద్ మలినేని - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సినిమాలో ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలను చుట్టేసి పదేపదే ఆయా ప్రాంతాల పేర్లను వినిపించారు.

Balakrishna Upcoming Film: మళ్ళీ వేటపాలెంలో వేట మొదలెట్టిన దర్శకుడు!

Balakrishna Upcoming Film Gopichand Malineni Character Searching In Vetapalem

Balakrishna Upcoming Film: ఈ మధ్యకాలంలో మేకర్స్ వారి వారి సొంత ప్రాంతాలను హైలెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కించడం ఆనవాయితీగా మారింది. అంతకు ముందు రాయలసీమ, తెలంగాణ, హైదరాబాద్ పేర్లే సినిమాలలో ఎక్కువగా వినిపిస్తే ఇప్పుడు ఒక్కో జిల్లా పేర్లు.. ఎక్కడో తెలియని మారుమూల ప్రాంతాల పేర్లు కూడా ఘనంగా వినిపిస్తున్నాయి మన సినిమాల్లో. ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు సినిమాలే అందుకు ఉదాహరణ. చిన్న సినిమాగా మొదలై భారీ సక్సెస్ కొట్టిన జాతి రత్నాలు సినిమాలో జోగిపేట-సంగారెడ్డి పేర్లను హైలెట్ చేశారు. కథకూడా ముగ్గురు జోగిపేట ఆవారా కుర్రాళ్ల కథ కావడంతో సినిమాలో ఇది బాగా కలిసిపోయింది.

ఇక గోపిచంద్ మలినేని – రవితేజ కాంబినేషన్ లో వచ్చిన క్రాక్ సినిమా కరోనా తర్వాత సక్సెస్ కొట్టిన తొలి సినిమాగా ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చింది. క్రాక్ లో ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాలను చుట్టేసి పదేపదే ఆయా ప్రాంతాల పేర్లను వినిపించారు. సినిమా షూటింగ్ కూడా ఎక్కువ భాగాన్ని ప్రకాశం జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలలో తెరకెక్కించారు. చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, వేటపాలెం బీచ్, చీరాల సెంటర్, ఒంగోలు సిటీ ఇలా ఒక్కో సన్నివేశంలో ఒక్కో ప్రాంతాన్ని హైలెట్ చేశారు. వేటపాలెం బీచ్ అందులో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ ఫైట్ సీన్ సినిమాకు హైలెట్ గా మారాయి.

కాగా.. ఇప్పుడు క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి వేటపాలెంలో వేట మొదలుపెట్టాడు. కథ కోసం అక్కడకి చేరుకున్న దర్శకుడు తన తర్వాత సినిమా కోసం సెర్చ్ మొదలుపెట్టాడు. క్రాక్ కోసం ప్రకాశం, గుంటూరు జిల్లాలోని కొన్ని నిజజీవిత క్యారెక్టర్లను ఒక కథగా మార్చి తెరకెక్కించినట్లుగా దర్శకుడే చెప్పాడు. కాగా ఇప్పుడు తన తర్వాత సినిమా కోసం కూడా కొన్ని పాత్రలను తీసుకొనేందుకు గోపీచంద్ కసరత్తులు చేస్తున్నాడు. ఇందు కోసం వేటపాలెంలోని ఒక పురాతన లైబ్రరీలో న్యూస్ పేపర్లు, పుస్తకాలు తిరగేస్తున్నాడు.

గోపీచంద్ తన తర్వాత సినిమాను నందమూరి బాలకృష్ణతో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి అఖండ సినిమా చేస్తున్న బాలయ్య తర్వాత గోపీచంద్ కు ఒకే చెప్పాడు. ఇప్పటికే కథను వినిపించిన గోపీచంద్ ఫైనల్ స్క్రిప్ట్ పనిలో ఉన్నాడట. అందుకే కొన్ని పాత్రల కోసం వేటపాలెంలో అన్వేషణ చేస్తున్నాడు. అక్కడ 100 ఏళ్ల క్రితం నాటి సారస్వత నికేతనం అనే పురాతనమైన లైబ్రరీలో ఓల్డ్ న్యూస్ పేపర్స్ ని తిరగేస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్రాక్ లో కటారి కృష్ణ – జయమ్మ పాత్రలను తెచ్చిన గోపీచంద్ బాలయ్య సినిమా కోసం ఎలాంటి పాత్రలు తెస్తాడోనని నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read: Jr NTR Viral Pic: బాలరాముడిగా బుల్లి రామయ్య.. మరోసారి ఫోటో వైరల్!