Akhanda : సరైన మాస్ బొమ్మ పడితే బాక్సాఫీస్ బద్దలవుద్దీ.. ‘అఖండ’ గా సోషల్ మీడియాలో బాలయ్య అరాచకం..

నటసింహ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.. ఉగాది కానుకగా బాలయ్య నటిస్తున్న 106వ సినిమా టైటిల్ అండ్ BB 3 టైటిల్ రోర్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. సరికొత్త గెటప్‌లో బాలయ్యను చూసి ఫ్యాన్స్, ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. ‘అఖండ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..

Akhanda : సరైన మాస్ బొమ్మ పడితే బాక్సాఫీస్ బద్దలవుద్దీ.. ‘అఖండ’ గా సోషల్ మీడియాలో బాలయ్య అరాచకం..

Akhanda

Akhanda: నటసింహ నందమూరి బాలకృష్ణ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.. ఉగాది కానుకగా బాలయ్య నటిస్తున్న 106వ సినిమా టైటిల్ అండ్ BB 3 టైటిల్ రోర్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. సరికొత్త గెటప్‌లో బాలయ్యను చూసి ఫ్యాన్స్, ఆడియెన్స్ సర్‌ప్రైజ్ అయ్యారు. ‘అఖండ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Balayya

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి-బాలయ్య బాబు కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ ఫిలిం కావడంతో ముందునుండీ భారీ అంచనాలున్నాయి.. ఒకే ఒక్క వీడియోతో అంచనాలను ఆకాశానికి తాకేలా చేశారు బాలయ్య-బోయపాటి.. రిలీజ్ చేసినప్పటినుండి ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతూ.. 25 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ‘అఖండ’ రికార్డ్ నెలకొల్పింది. 3 లక్షల 60 వేలకు పైగా లైక్స్ సాధించింది.. సీనియర్ హీరోల్లో ఈ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలయ్యే..

Akhanda : కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.. ‘అఖండ’ గా నట‘సింహా’ గర్జన..

‘‘హర హర మహాదేవ.. శంభో శంకర.. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’’.. అంటూ తన స్టైల్లో డైనమెట్ లాంటి డైలాగ్ పేల్చారు బాలయ్య.
అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఈ డైలాగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 28న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..