Bamboo : ఆరోగ్యానికి వెదురు పిలకలు

ఈ పిలకల్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువునీ తగ్గిస్తాయి. పొట్ట కూడా తగ్గినట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

Bamboo : ఆరోగ్యానికి వెదురు పిలకలు

Bamboo Plants

Bamboo : అరటి పువ్వు లాగానే ఇటీవలి కాలంలో వెదురు పిలకలను చాలా మంది ఆహారంలో బాగం చేసుకుంటున్నారు. వరి, జొన్న, సజ్జ లాగానే వెదురు కూడా ఓ గడ్డిజాతి మొక్క, వెదురును కలపగా ఉపయోగిస్తారు. వెదురు మొక్క మొదట్లో వచ్చే పిలకలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఎందుకంటే ఈపిలకల్లో ఎన్నో పోషకాలు దాగి ఉండటమే ఇందుకు కారణం. ఆగ్నేయాసియా దేశాలతోపాటు, మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ పిలకలతో కూరలూ సూప్‌లూ చేస్తారు.

వెదురు పిలకల్లో ప్రొటీన్లూ పీచుతోపాటు కాపర్‌, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, రిబోఫ్లేవిన్‌, విటమిన్‌-ఎ, కె, ఇ, బి6…వంటి విటమిన్లూ ఈ వెదురు పిలకల్లో పుష్కలంగా దాగున్నాయి. ఇవికాక వీటిలో ఉండే ఫైటోస్టెరాల్సూ, ఫైటోన్యూట్రియంట్లూ, పీచూ వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

ఆరోగ్యంగా ఉన్న మహిళలు వరసగా ఆరు రోజులపాటు వీటిని తిన్నప్పుడు వాళ్లలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది. కప్పు వెదురు పిలకల్లో అంటే సుమారు 155 గ్రాముల్లో రెండు గ్రా. పీచు లభిస్తుంది. ఇది రక్తంలో కొలొరెక్టల్‌ క్యాన్సర్‌ను సైతం తగ్గిస్తుంది. ఇది ప్రిబయోటిక్‌గా పనిచేస్తుందట. అంటే- పొట్టలోని బ్యాక్టీరియాకి ఆహారంగా ఉపయోగపడుతుంది. తద్వారా మధుమేహం, డిప్రెషన్‌, ఊబకాయం తగ్గడానికీ దోహదపడుతుంది.

నొప్పులు తగ్గడానికీ పొట్ట సమస్యల్ని నివారించడానికీ తోడ్పడతాయని మరికొన్ని పరిశీలనల్లో తేలింది. వీటిలో ఎక్కువగా ఉండే పొటాషియం వల్ల బీపీ రోగులకీ ఇవి మంచిదే. గర్భిణీలకు తొమ్మిదోనెలలో వీటిని తినిపించడం వల్ల గర్భాశయం సంకోచం చెంది కాన్పు తేలికవుతుందని చైనా సంప్రదాయ వైద్యం చెబుతుంది.

ఈ పిలకల్లో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువునీ తగ్గిస్తాయి. పొట్ట కూడా తగ్గినట్లు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ ముఖ్యంగా నాడీసంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయనీ చెబుతున్నారు. వీటిని నీళ్లలో మరిగించి తేనెతో కలిపి తీసుకుంటే శ్వాససంబంధ వ్యాధులు దూరమౌతాయి.

జాగ్రత్తలు..

వెదురు పిలకల్లో కర్ర పెండలంలో మాదిరిగానే కొన్ని రకాల టాక్సిన్లు ఉంటాయి. ఉడికించినప్పుడు ఇవి తొలగిపోతాయి. అందుకే తాజా వెదురు పిలకల్ని శుభ్రం చేసి పావుగంటసేపు పసుపులో ఉడికించాకే కూరల్లో వేస్తుంటారు. పులియబెట్టి బంగాళాదుంపలు, బీన్స్‌తో కలిపి వండుతారు. మరికొందరు రెండు మూడు రోజులపాటు నీళ్లలో నానబెట్టి ఆ తరవాత పచ్చడి పడతారు. కొన్నిచోట్ల అనేక నెలలపాటు పులియబెట్టీ వాడుకుంటారు.