Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర .. తొలిరోజు సాగేదిలా..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డిలు పాల్గోనున్నారు.

Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర .. తొలిరోజు సాగేదిలా..

Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో జరిగే ప్రారంభసభకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10గంటల సమయంలో యాదాద్రికి చేరుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కేంద్ర మంత్రులతో కలిసి బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం 11గంటల సమయంలో వంగపల్లి రోడ్ లో నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర మంత్రులతో కలిసి సంజయ్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది.

Bandi Sanjay : కేసీఆర్ ఈడీ విచారణ ఎదుర్కోక తప్పదు-బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తొలిరోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 10.5 కి.మీలు పాదయాత్ర చేస్తారు. యాదరిగిరిపల్లి, గాంధీనగర్, యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మీదుగా గణేష్ నగర్ నుంచి శుభం గార్డెన్ కు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి పాతగుట్ట, గొల్లగుడిసెలు మీదుగా దాతారుపల్లికి పాదయాత్రగా వెళ్తారు. దాతారుపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుంచి బస్వాపూర్ చేరుకుంటారు. బస్వాపూర్ సమీపంలో రాత్రి బస చేస్తారు.

Bandi Sanjay : టీఆర్‌ఎస్‌లో చాలా మంది షిండేలు : బండి సంజయ్‌

మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర 24రోజులు పాటు కొనసాగనుంది. యాదాద్రి జిల్లా నుంచి నేడు ప్రారంభమై వరంగల్‌ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో యాత్ర ముగుస్తుంది. ఈ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంజయ్ .. ఐదు జిల్లాలు 12 నియోజకవర్గాల్లో 328 కి.మీ లు పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు.