2024 Lok Sabha polls: అందుకే అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టారు: మ‌మ‌తా బెన‌ర్జీ

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద సైనికుల పదవీ విరమణ వయసును 65 ఏళ్ళ‌కు పెంచాల‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ డిమాండ్ చేశారు.

2024 Lok Sabha polls: అందుకే అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ప్రవేశపెట్టారు: మ‌మ‌తా బెన‌ర్జీ

Mamata Banerjee's 'dream for India

2024 Lok Sabha polls: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద సైనికుల పదవీ విరమణ వయసును 65 ఏళ్ళ‌కు పెంచాల‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ డిమాండ్ చేశారు. ఈ ప‌థ‌కం కింద కేవ‌లం నాలుగేళ్ళు మాత్ర‌మే త్రివిధ ద‌ళాల్లో ప‌నిచేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, నాలుగేళ్ళ త‌ర్వాత త‌మ భ‌విష్య‌త్తు ఏమైపోతుంద‌న్న ఆందోళ‌న‌లో సైనికులు ఉంటార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ చెప్పారు.

Maharashtra Crisis: మ‌హారాష్ట్ర డిప్యూటీ స్పీక‌ర్‌, సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

దీనిపై అనిశ్చితి నెల‌కొంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నాలుగు ఏళ్ళ త‌ర్వాత ఆ సైనికులు ఏ ప‌ని చేసుకుంటార‌ని ఆమె ప్ర‌శ్నించారు. దేశంలో 2024లో నిర్వ‌హించే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్ర‌భుత్వం అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింద‌ని ఆమె అన్నారు. ప‌శ్చిమ బెంగాల్‌లోని బ‌ర్ధ‌మాన్‌లో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శివ‌సేన నేత సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నోటీసులు పంపిన విష‌యంపై కూడా ఆమె స్పందించారు. ప్ర‌జ‌ల‌ను ఈ విధంగా బీజేపీ ఎందుకు వేధిస్తోందని ఆమె నిల‌దీశారు. ప్ర‌జాస్వామ్యాన్ని న‌డిపే తీరు ఇదేనా? అంటూ ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.