Bangladesh vs India Match: షకీబ్ వచ్చేశాడు.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్

భారత్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా చేరాడు.

Bangladesh vs India Match: షకీబ్ వచ్చేశాడు.. భారత్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్

Shakib Al Hasan

Bangladesh vs India Match: భారత్‌తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా చేరాడు. వెస్టిండీస్, జింబాబ్వేతో జరిగిన చివరి రెండు వన్డే సిరీస్‌ల నుండి షకీబ్ అల్ హసన్ విరామం తీసుకున్నాడు. టీమిండియాతో డిసెంబర్‌లో జరిగే వన్డే జట్టులో షకీబ్‌ను మరోసారి జట్టులో బంగ్లా సెలక్టర్లు ఎంపిక చేశారు.

Bangladesh vs Zimbabwe T20 Match: రాణించిన నజ్ముల్ శాంటో.. ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై బంగ్లాదేశ్ గెలుపు ..

2015 తర్వాత తమ తొలి ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్ జట్టు డిసెంబర్ 1న బంగ్లాదేశ్ కు చేరుకుంటుంది. మొదటి, రెండు వన్డేలు డిసెంబర్ 4, 7 తేదీల్లో ఢాకాలో జరుగుతాయి. మూడో వన్డే డిసెంబర్ 10న చిట్టగాంగ్ లో జరగుతాయి. ఆ తర్వాత ఇరు జట్టు రెండు టెస్టులు ఆడనున్నాయి. బంగ్లా ప్రకటించిన వన్డే జట్టులో ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌తో పాటు ఫాస్ట్ బౌలర్ ఇబాదత్ హుస్సేన్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ యాసిర్ అలీ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇదిలాఉంటే వన్డే మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతాయి.

బంగ్లాదేశ్ జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిటన్ దాస్, అనాముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోట్ హుస్సేన్, నసీమ్ హమీద్, మహ్మదుల్లా, నజ్ముల్ శాంటో, నురుల్ హసన్.