ఆ 2 డ్రగ్స్ కలిపి వాడితే…4 రోజుల్లోనే కోలుకున్న కరోనా పేషెంట్లు

  • Published By: venkaiahnaidu ,Published On : May 18, 2020 / 09:20 AM IST
ఆ 2 డ్రగ్స్ కలిపి వాడితే…4 రోజుల్లోనే కోలుకున్న కరోనా పేషెంట్లు

కరోనా పేషెంట్లు కోలుకునేందుకు రెండు విసృతంగా ఉపయోగించే డ్రగ్స్ ను కలిపి (కాంబో) వాడటం ద్వారా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయని బంగ్లాదేశ్‌లోని ఓ సీనియర్ డాక్టర్ నేతృత్వంలోని మెడికల్ టీమ్ తెలిపింది. దేశంలోని ప్రముఖమైన ఫిజీషియన్స్ కూడా ఉన్న ఈ మెడికల్ టీమ్…తరుచుగా వాడుతుండే వెర్మిక్టిన్(vermectin) అనే యాంటీప్రోటోజోయల్ మందును (టానిక్ లాంటిది)… ఓ సింగిల్ డోస్ తీసుకొని… దానికి Doxycycline(ఓ యాంటీబయాటిక్) కలిపి వాడితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నట్లు తెలిపింది.

 మొత్తం 60 మంది కోవిడ్-19 పేషెంట్లపై ఈ రెండు రకాల మందులను కలిపి వాడటం ద్వారా మొత్తం 60 మందీ కోలుకున్నారని బంగ్లాదేశ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (BMCH)లో మెడికల్ ‌డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ ఎండీ తారెక్ అలం తెలిపారు. తాము ఇచ్చిన మందుల కాంబోతో ఆ 60 మందీ నాలుగు రోజుల్లో కోలుకున్నారని  తెలిపారు. మూడు రోజుల్లోనే కరోనా లక్షణాలు 50 శాతం తగ్గాయన్నారు.

కోలుకున్నవారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని అలం చెప్పారు. ప్రతి పేషెంట్‌కీ ఈ రెండు మందులే ఇచ్చినట్లు తారెక్ తెలిపారు. ఆ పేషెంట్లంతా మొదట్లో శ్వాస సంబంధ సమస్యలతో హాస్పిటల్ కు వచ్చారనీ, వారికి టెస్టులు చేసినప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిందని తారెత్ తెలిపారు. ఇప్పుడు వాళ్లంతా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ మందుల కాంబినేషన్‌ ను దేశంలో, ప్రపంచ దేశాల్లో అంతా వాడేలా ఏం చెయ్యాలో త్వరలో ప్రభుత్వ అధికారుల్ని కలిసి మాట్లాడతామని అలం అన్నారు.

దీనిపై ప్రపంచ దేశాలు సైంటిఫిక్ రివ్యూ అడుగుతాయని చెప్పిన ఆయన… అందుకోసం తాము ఓ రిపోర్టును తయారుచేసి… ఓ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురిస్తామన్నారు. ఇప్పటివరకూ యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్, రిటానవిర్, Mycobacterium, ఎబోలా డ్రగ్ రెమ్ డిసివర్ అనే మందులు కరోనాను తరిమేస్తున్నట్లు ఫలితాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఈ కాంబో మందులు కూడా చేరే అవకాశముంది. 

కాగా,ప్రస్తుతం బంగ్లాదేశ్ లో 23,870కరోనా కేసులు నమోదవగా,349మంది కోలుకున్నారు. 4,585మంది కోలుకున్నారు. బంగ్లాదేశ్ లో ఏప్రిల్ రెండవ వారం నుంచే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో కేసుల సంఖ్య రోజుకి 1000కి పైగా ఉంటుంది. కానీ రికవరీ రేటు మాత్రం తక్కువగా ఉంది. 

Read:కారు బాంబుతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్థాన్..