హైదరాబాద్ షేక్‌పేట్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్ట్

హైదరాబాద్ షేక్‌పేట్‌లో అంతర్జాతీయ వ్యభిచార ముఠా అరెస్ట్

banjara hills police busted prostitution racket: హైదరాబాద్ షేక్ పేట్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. అంతర్జాతీయ వ్యభిచార ముఠాను బంజారాహిల్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్‌పేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో ఇద్దరు నైజీరియన్లతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు ఉన్నట్లు గుర్తించారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కేంద్రంపై దాడులు నిర్వహించిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

కొంతకాలంగా ఓ అపార్ట్ మెంటులో ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతున్నారు. కాగా, వారు ఉంటున్న ప్లాట్ కు నిత్యం కొత్త వారు వస్తున్నారు. దీంతో అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారికి అనుమానం కలిగింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.