Banks: బ్యాంకులకు వరుస సెలవులు

వరుసగా బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి కనుక.  బుధవారం నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులున్నాయి.

Banks: బ్యాంకులకు వరుస సెలవులు

Bank

Bank Holidays : మీకేమన్నా బ్యాంకుల్లో పనులున్నాయా ? లావాదేవీలు నిర్వహిస్తుంటారా ? వారంలోపు చేయాల్సిన ఈ పనులు వెంటనే చేసుకొండి. వచ్చే వారానికి వాయిదా వేసుకుంటే..సమస్యలు ఏర్పడుతాయి. అందుకే తప్పకుండా వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే..వరుసగా బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి కనుక.  బుధవారం నుంచి ఆదివారం వరకు వరుసగా సెలవులున్నాయి. మంగళవారం ఒక్కే రోజు మాత్రమే మిగిలి ఉంది కనుక..ఆ రోజే పనులు చేసుకుంటే బెటర్.

Read More : Bhadrapada Masam 2021 : దేవతా పూజలకు..పితృదేవతల పూజకు ఉత్తమమైన మాసం భాద్రపద మాసం

సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం శ్రీమంత శంకరదేవి తిథి. ఈ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. మరుసటి రోజు సెప్టెంబర్ 09వ తేదీ గురువారం తీజ్ పండుగ. ఈ రోజు కూడా బ్యాంకులు తెరుచుకోవు. సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వినాయక చవితి పండుగ. సెప్టెంబర్ 11వ తేదీ రెండో శనివారం. కాబట్టి బ్యాంకులకు సెలవు దినం.

Read More :Covishield : 4 వారాలకే కొవిషీల్డ్ సెకండ్ డోస్.. కేరళ హైకోర్టు కీలక ఆదేశం

సెప్టెంబర్ 12న ఆదివారం ఎలాగూ బ్యాంకులకు సెలవు. సెప్టెంబర్ 08వ తేదీ నుంచి 12 వరకు వరుసగా బ్యాంకులకు సెలవులు. అయితే..ఈ బ్యాంకు హాలీడేస్ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. పండుగలు అన్ని జరుపుకొనే రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవులు ఉంటాయి. ఏ రాష్ట్రాల్లో ఏ పండుగ అయితే జరుపుకోరే…ఆ రోజు రాష్ట్రంలో బ్యాంకులు పనిచేయవనే సంగతి గుర్తుంచుకోవాలి.