Minister Sabitha : మంత్రి సబిత ఇంటి దగ్గర టెన్షన్..టెన్షన్.. భారీగా పోలీసు బలగాలు మోహరింపు

మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మంత్రి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్యార్థులకు మంత్రి సబిత ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే మంత్రి స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Minister Sabitha : మంత్రి సబిత ఇంటి దగ్గర టెన్షన్..టెన్షన్.. భారీగా పోలీసు బలగాలు మోహరింపు

Minister Sabitha : మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మంత్రి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్యార్థులకు మంత్రి సబిత ఇచ్చిన హామీలు ఏమయ్యాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే మంత్రి స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా మంత్రి ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.

Basara IIIT : రంగంలోకి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు.. మంత్రి సబితకు వార్నింగ్

బాసర ట్రిపుల్ ఐటీలో మెరుగైన వసతులు కల్పించాలని ఓవైపు విద్యార్థులు ఆందోళన చేస్తుంటే.. వారికి మద్దతుగా వారి తల్లిదండ్రులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో మంత్రి సబిత ఇంటి ముందు బైఠాయించారు. ఆదివారం ఉదయం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశమై ఉద్యమ కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తామని, మంత్రిని కలుస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు.

Basara IIT: ఇది మీ ప్రభుత్వం.. ఆందోళన విరమించండి.. విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ..

విద్యార్థుల సమస్యలను తీర్చడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్యార్థులకు మంత్రి సబిత ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు. సమస్యలు తీర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

IIIT Basara Students Protests : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం

”బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్న మా పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకి నీళ్లు కట్ చేశారు. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఆందోళన చేస్తున్న వారికి టీసీలు ఇస్తామని బెదిరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ కూడా అయ్యింది. అడుగడుగునా ఆంక్షలు విధించారు. ఫోన్ కూడా మాట్లాడనివ్వడం లేదు. పిల్లలను బెదిరిస్తున్నారు. మా పిల్లలు ఎలా చదువుకుంటారు? ఎలా బతుకుతారు? మా పిల్లలను చంపుకోమంటారా? తిండి పెట్టడం లేదు. చదువు చెప్పడం లేదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రిపుల్ ఐటీ బాసరలో అద్భుతమైన విద్య చెబుతారని అంటారు. అక్కడి చదువుకుంటే గొప్పవాళ్లు అవుతారని అంటారు. కానీ, అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కనీస వసతులు కూడా లేవు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? శాంతియుతంగా నిరసన తెలపడం తప్పా? అన్నం పెట్టమని అడుగుతున్నారు. చదువు చెప్పాలని అడుగుతున్నారు. అది తప్పా? ఇదేనా బంగారు తెలంగాణ? మా పిల్లలను చంపుకోవడానికి పంపించామా బాసర ట్రిపుల్ ఐటీకి?” అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.