BCCI : రవిశాస్త్రి, కోహ్లీలపై బీసీసీఐ గుస్సా..బుక్ లాంచ్ కార్యక్రమమే కారణమా ?

టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలపై బీసీసీఐ (BCCI)..ఒకింత ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. బీసీసీఐ అనుమతి తీసుకోకుండానే..ఓ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

BCCI : రవిశాస్త్రి, కోహ్లీలపై బీసీసీఐ గుస్సా..బుక్ లాంచ్ కార్యక్రమమే కారణమా ?

Bcci Twitter

Shastri-Kohli : కోవిడ్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. కరోనా నిబంధనల ప్రకారం పలు క్రీడలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో క్రికెట్ ఒకటి. ఇందులో పాల్గొనే క్రీడాకారులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అయితే..ఓ విషయంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీలపై బీసీసీఐ (BCCI)..ఒకింత ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. బీసీసీఐ అనుమతి తీసుకోకుండానే..ఓ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రవిశాస్త్రి, కోహ్లీలను వివరణ కోరినట్లు, ఈవెంట్ కు సంబంధించిన ఫొటోలు బీసీసీఐ పెద్దలకు చేరినట్లు తెలుస్తోంది.

Read More : Ravi Shastri : టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్

భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో…కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ లు కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరంతా లండన్ లో గత వారం జరిగిన ఓ బుక్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లిన అనంతరం కోవిడ్ బారిన పడ్డారని తేలింది. ముగ్గురూ కోవిడ్ బారిన పడినా..కోహ్లీ, ఇతరులకు నెగటివ్ వచ్చింది.

Read More : India vs England : చరిత్ర సృష్టించారు, భారత్ ఘన విజయం

ఇదిలా ఉంచితే..బుక్ లాంచ్ ప్రోగ్రామ్ కు బీసీసీఐ అనుమతి కోరలేదని తెలుస్తోంది. నాలుగో టెస్టు ముగిసింది కాబట్టి..రవి శాస్త్రి, కోహ్లీల నుంచి వివరణ కోరే అవకాశం ఉంది. ఈవెంట్ కు వెళ్లడంలో టీమ్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గిరిష్ డోంగ్రె ప్రాతను కూడా బోర్డు పరిశీలిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ప్లేయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఈవెంట్ లకు వెళ్లవద్దని…బీసీసీఐ కార్యదర్శి జే షా ఒక్కో ప్లేయర్స్ కు ప్రత్యేకంగా నోటీసులు పంపినా నిర్లక్ష్యంగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. మరి…ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.