BCCI Chief Roger Binny: మాకు ఐసీసీ అనుకూలంగా ఉందని అనుకోకండి.. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వివాదంపై స్పందించిన బీసీసీఐ చీఫ్..
భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ లో కోహ్లీ నిజంగానే ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, ఈ విషయాన్ని అప్లైర్లు గుర్తించక పోవటంతో భారత్ కు లాభం చేకూరిందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా వ్యాఖ్యానించడంతో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు.

BCCI Chief Roger Binny
BCCI Chief Roger Binny: టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12లో భాగంగా బంగ్లాదేశ్‌తో చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో డక్ వర్త్ లూయిస్ విధానంలో ఐదు పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. భారత్ చేతిలో ఓటమిపాలైన బంగ్లాదేశ్ ప్లేయర్స్, ఫాన్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆరోపణలు చేస్తున్నారు. మ్యాచ్ ఉత్కంఠగా జరుగుతున్నప్పుడు కోహ్లీ ‘ఫేక్ ఫీల్డింగ్’ చేశాడని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఆరోపించాడు. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్‌ను అంపైర్లు గుర్తించలేదన్నాడు. ఫేక్ ఫీల్డింగ్ కారణంగా తమకు ఐదు పరుగులు రాలేదని, ఒకవేళ ఆ రన్స్ వచ్చి ఉంటే బంగ్లా విజయం సాధించేది అని నూరుల్ హసన్ పరోక్షంగా అన్నాడు.
Virat Kohli Video: ఆస్ట్రేలియాలో తోటి ఆటగాళ్ల మధ్య కేక్ కట్ చేసిన విరాట్ కోహ్లీ
భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్ లో కోహ్లీ నిజంగానే ఫేక్ ఫీల్డింగ్ చేశాడని, ఈ విషయాన్ని అప్లైర్లు గుర్తించక పోవటంతో భారత్ కు లాభం చేకూరిందని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా వ్యాఖ్యానించడంతో కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వివాదం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వివాదంపై బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. ఫర్వాలేదు.. ఐసీసీ మాకు అనుకూలంగా ఉందని నేను అనుకోను. అందరికీ ఒకే విధమైన న్యాయం లభిస్తుంది. మేము ఇతర జట్లకు భిన్నంగా ఏమి పొందుతాము? క్రికెట్‌లో భారతదేశం పెద్ద పవర్‌హౌస్, కానీ మనమందరం ఒకేలా వ్యవహరిస్తాము అని రోజర్ బిన్నీ అన్నారు.
T20 World Cup 2022: వర్షం పడి రేపటి భారత్-జింబాబ్వే మ్యాచ్ రద్దయితే.. పరిస్థితి ఏంటీ?
2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళుతుందా అని ప్రశ్నించగా.. ఆ విషయం మా చేతుల్లో లేదని బిన్నీ తెలిపాడు. భారత్ జట్టు పాకిస్థాన్, ఇతర దేశాల పర్యటనపై బోర్డు సొంతంగా నిర్ణయాలు తీసుకోదని, ప్రభుత్వ నిర్ణయాలపైనే ఆదారపడుతుందని బిన్నీ తెలిపారు.