BCCI – Kohli : విరాట్ కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ కామెంట్..

భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేశాడు.. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై BCCI స్పందించింది.

BCCI – Kohli : విరాట్ కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ కామెంట్..

Bcci Thanks Virat Kohli For His Admirable Leadership As India's Test Captain

BCCI thanks Virat Kohli : భారత క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై చెప్పేశాడు.. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) స్పందించింది. విరాట్ నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతించింది. విరాట్‌ కృషికి అభినందనలు తెలిపింది. విరాట్ కోహ్లి నిర్ణయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు.

టీమిండియా కెప్టెన్‌గా జట్టును ఉన్నతస్థాయికి తీసుకెళ్లావంటూ ప్రశంసించారు. ఇటు స్వదేశంలో, అటు విదేశాల్లోనూ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా బలమైన శక్తిగా ఎదిగిందని కొనియాడారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో కోహ్లీ సారథ్యంలో సాధించిన విజయాలు ఎంతో ప్రత్యేకమైనవిగా తెలిపారు. కోహ్లీ అందించిన విజయాలు ఎప్పటికీ మరువలేనివిగా జైషా అభినందించారు.

కోహ్లీ షాకింగ్ నిర్ణయంపై బీసీసీఐ ట్విట్టర్ వేదికగా స్పందించింది. కోహ్లీ.. నీ కెప్టెన్సీలో భారత జట్టు.. ఎన్నో మైలురాళ్లను దాటింది.. అలాగే జట్టు అత్యున్నత స్థాయికి చేరుకుందని బీసీసీఐ తెలిపింది. 2015 ప్రారంభంలో MS ధోని ఆస్ట్రేలియాలో రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు ఫుల్ టైం టెస్ట్ కెప్టెన్‌గా 33 ఏళ్ల కోహ్లీ బాధ్యతలు స్వీకరించాడు.


68 టెస్టుల్లో 40 విజయాలు సాధించిన కోహ్లీ.. టెస్టు ఫార్మాట్‌లో టీమిండియా అత్యంత మోస్ట్ సక్సస్ ఫుల్ కెప్టెన్‌గా వైదొలిగాడు. ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయంలో జట్టుకు కోహ్లీ సేవలందించాడు. ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లాడు.

Read Also : BSNL Prepaid Plans : BSNL కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్.. బెనిఫిట్స్ ఇవే..!