ఈ ఫేక్ యాప్‌తో జాగ్రత్త.. మొత్తం దోచేస్తారు

ఈ ఫేక్ యాప్‌తో జాగ్రత్త.. మొత్తం దోచేస్తారు

be careful with club house app: క్లబ్ హౌస్(Clubhouse)… ఆడియో చాట్ సోషల్ మీడియా యాప్. అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దీంతో హ్యాకర్ల కన్ను ఈ యాప్ పై పడింది. ఈ యాప్ పాపులారిటీని తమకు అనువుగా మార్చుకుని మోసం చేసేందుకు హ్యాకర్లు రెడీ అయ్యారు. అచ్చం క్లబ్ హౌస్ లానే ఉండే నకిలీ యాప్ ని క్రియేట్ చేసి వినియోగదారులను చీట్ చేస్తున్నారు. ఓ కోడ్ సాయంతో ఫ్రాడ్ కి పాల్పడుతున్నారు. యూజర్ల వ్యక్తిగత డేటాని దొంగిలిస్తున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్ స్కై(kaspersky) భద్రతా నిపుణుడు డెన్నిస్ లెగ్జో ఈ విషయాన్ని తెలిపారు.

షాంఘైలోని రియల్ టైమ్ ఎంగేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ప్రొవైడర్ సంస్థ అగోరా.. క్లబ్‌హౌస్ యాప్‌కు బ్యాక్ ఎండ్ మౌలిక సదుపాయాలను సరఫరా చేస్తుంది. క్లబ్‌హౌస్‌కు షాంఘై, సిలికాన్ వ్యాలీలో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. క్లబ్‌హౌస్‌ యాప్‌ ప్రస్తుతం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, దాని నకిలీ వెర్షన్ ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం తయారు చేశారు. వాస్తవానికి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం క్లబ్‌హౌస్‌ కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక యాప్‌ విడుదల చేయలేదు.

నకిలీ యాప్‌ను మన ఫోన్ లో ఇన్ స్టాల్ చేయగానే మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం మొదలుపెడుతుంది. మన ఆడియో, వీడియోలతో పాటు ఫొటోలు కూడా హ్యాకర్లుకు చేరిపోతాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారుల ఎన్‌క్రిప్షన్‌, పింగ్‌లో మార్పులు చేస్తున్నట్లు క్లబ్‌హౌస్ ప్రకటించింది. ఈ మార్పులను చట్టబద్ధం చేయడానికి, సమీక్షించడానికి ప్రత్యేక డాటా భద్రతా సంస్థను నియమించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2020 మార్చిలో ప్రారంభించిన ఈ క్లబ్‌హౌస్ యాప్‌.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది.

సాఫ్ట్ వేర్ డెవలపర్ Alpha Exploration Co దీన్ని లాంచ్ చేసింది. Silicon Valley entrepreneur Paul Davison, గూగుల్ ఉద్యోగి Rohan Seth డెవలప్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కమ్మేసిన వేళ 2020 ఏప్రిల్ లో దీన్ని లాంచ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల కారణంగా ఈ యాప్ అనతి కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. 2020 మేలో 12 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించింది. 2020 డిసెంబర్ నాటికి 6లక్షల మంది రిజిస్ట్రర్ అయ్యారు. 2021 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 60లక్షలకు పెరగడం విశేషం. ప్రస్తుతం ఐఓఎస్ వినియోగదాలరుకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ వినియోగదారులకు కోసం యాప్ ని తీసుకురానున్నారు.

ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రామ్ వంటి సోషల్ మీడియాలతో విసిగిపోయిన జనాలు కొత్త ప్లాట్ ఫామ్స్ కోసం వెతుకుతున్నారు. అలాంటి వారికి క్లబ్ హౌస్ బాగా నచ్చింది. ఇది ఎంత పాపులర్ అయ్యిందంటే.. ఫేస్ బుక్, ట్విట్టర్ లు.. అలాంటి అప్లికేషన్ రూపకల్పన చేసే పనిలో పడ్డాయి. లాంచ్ చేసిన నెలల వ్యవధిలోనే లక్షలాది మంది రిజిస్ట్రర్ అయ్యారు. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.