Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

పాదముద్రల ఆధారంగా యూనివర్సిటీలో దట్టంగా ఉన్న చెట్ల వైపు వెళ్లిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.

Bear : శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

Bear

Bear : కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో మరోసారి ఎలుగుబంటి హల్‌చల్‌ చేసింది. యూనివర్సిటీ సమీపంలోని మల్కాపూర్‌లో స్థానికులకు ఎలుగుబంటి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు మల్కాపూర్‌లో గాలించినప్పటికీ ఎక్కడా కనిపించలేదు.

పాదముద్రల ఆధారంగా యూనివర్సిటీలో దట్టంగా ఉన్న చెట్ల వైపు వెళ్లిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటల తర్వాత విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో యూనివర్సిటీలోని నీటి గుంత వద్దకు వచ్చిన ఎలుగుబంటి.. 15 నిమిషాల పాటు అక్కడే కలియతిరింది.

Bear Kills Couple : గుడిలో ప్రార్థనలు చేస్తుండగా ఘోరం.. దంపతులను చంపి తిన్న ఎలుగుబంటి

ఎలుగుబంటిని చూసిన విద్యార్థిని దానిని తన ఫోన్‌లో రికార్డ్ చేసింది. యూనివర్సిటీ అధికారుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అయినప్పటికీ ఎలుగుబంటి జాడ తెలియలేదు.