Children Behavior : పిల్లలకు మార్కులతోపాటు నడవడిక ముఖ్యమే!.

ఇటీవలికాలంలో చాలా మంది పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ అయిపోతూ ఎక్కువ సమయంలో వాటితో కాలం గడుపుతున్నారు. అలా వాటికి పరమితం కాకుండా చూసుకోవాలి.

Children Behavior : పిల్లలకు మార్కులతోపాటు నడవడిక ముఖ్యమే!.

Children

Children Behavior : పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలకు మార్కులు మాత్రమే ముఖ్యం కాదు, వారి ప్రవర్తన విషయంలోను శ్రద్ధ వహించాలి. సభ్యత, సంస్కారం అలవడేలా చూడాలి. క్రమశిక్షణతో పిల్లలను పెంచాలి. నలుగురిలో వారి నడవడిక సక్రమంగా ఉంటే అంతకంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఆనందం మరొకటి ఉండదు. సహజంగా కూతురు తండ్రిని, కొడుకు తల్లిని అనుకరిస్తారని సైకాలజీ నిపుణులు చెప్తారు. అందుకని తగు జాగ్రత్తలతో నడుచుకోవడం అవసరం. కోవిడ్ తో పిల్లలు ఎక్కువ రోజులు ఇంటికే పరిమితం కావటంతో వారి ప్రవర్తనలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. పిల్లల పెంపకం విషయంలో కొన్ని రకాల సూచనలు పాటిస్తే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారవుతారు. తల్లిదండ్రులు పిల్లల విషంలో పాటించాల్సిన సూచనలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇటీవలికాలంలో చాలా మంది పిల్లలు టీవీ,కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ కి అడిక్ట్ అయిపోతూ ఎక్కువ సమయంలో వాటితో కాలం గడుపుతున్నారు. అలా వాటికి పరమితం కాకుండా చూసుకోవాలి. వాటి వల్ల అనర్థాలను పిల్లలకు తెలియచెప్పాలి. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై వారిలో అవగాహన పెంపొందించాలి. మంచినీళ్ళు, పాలు తాగిన గ్లాసులు పిల్లలు ఎక్కడివి అక్కడే పడేయకుండా సింక్ లో వేయడం, డైనింగ్ టేబుల్ మ్యానర్స్ నేర్చుకునేలా అలవాటు చేయాలి. విడిచిన బట్టలను ఎక్కడ వెయ్యాలో, ఏవి హ్యాంగర్‌కి తగిలించాలో పెద్దలు చేసి చూపిస్తే పిల్లలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది.

పిల్లల ఐక్యూ పెంచేలా మంచి పుస్తకాలను వారికి అందుబాటులో ఉంచండి. మంచి విషయాలు చెప్పండి. చెస్, పజిల్స్,  పిల్లల మెదడుకి పదునుపెడతాయి. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా వారితో రోజూ కొంత సమయం గడపడం అవసరం. పిల్లల చెప్పే మాటలు కూడా ఆసక్తిగా వినే ప్రయత్నించాలి. వారించటం మంచిది కాదు. తప్పైతే సర్ధిచెప్పి ఏది మంచో , ఏది చెడో తెలియజేయాలి. వారి పనులను వారు చేసుకునేలా ప్రోత్సహించడం మరవద్దు.

ఇంట్లో అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆర్పే పద్ధతిని పిల్లలు అలవర్చుకునేలా చూడాలి. చాక్‌లెట్ రేపర్స్.. ఇతర చెత్తను ఎప్పటికప్పుడు చెత్తబుట్టలో వేయడం లాంటివి పిల్లలకు నేర్పాలి. పిల్లలకు ట్రాఫిక్ రూల్స్ నేర్పించడం అన్ని విధాలా శ్రేయస్కరం అని గమనించండి. పెయింటింగ్, మొక్కలు పెంచడం, బుక్ రీడింగ్.. లాంటి మంచి అలవాట్లు వారి సృజనాత్మకతను తట్టి లేపుతాయి. అతి గారాబం పనికిరాదు.