Ben Stokes : ఆ సమయం ఆసన్నమైంది.. అందరికి ఛాన్స్ రావాలి కదా.. స్టార్ ఆల్‌రౌండర్ షాకింగ్ నిర్ణయం!

ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు. వన్డే క్రికెట్ నుంచి స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

Ben Stokes : ఆ సమయం ఆసన్నమైంది.. అందరికి ఛాన్స్ రావాలి కదా.. స్టార్ ఆల్‌రౌండర్ షాకింగ్ నిర్ణయం!

Ben Stokes Announces Retirement From Odis, Will Play Last Match On Tuesday

Ben Stokes : ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) వన్డేలకు గుడ్ బై చెప్పేశాడు. వన్డే క్రికెట్ నుంచి స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేర‌కు సోమ‌వారం ( (జూలై 18)న సాయంత్రం స్టార్ ఆల్ రౌండర్ ప్రకటన చేశాడు. అయితే మంగ‌ళ‌వారం (జూలై 19)న డర్హామ్‌లో దక్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న వ‌న్డే త‌న‌కు చివ‌రిదిగా బెన్ స్టోక్స్ ప్ర‌క‌టించాడు. వ‌న్డేల‌కు వీడ్కోలు పలికిన స్టోక్స్.. టెస్టు క్రికెట్‌లో మాత్రం కొన‌సాగనున్నాడు.  తన ట్విట్టర్ అకౌంట్లో ఇదే విషయాన్ని ప్రకటించాడు. ప్రపంచ కప్ ట్రోఫీని పట్టుకున్న ఫొటోను కూడా జత చేశాడు. ‘మంగళవారం డర్హామ్‌లో జరిగే ఇంగ్లండ్‌కు వన్డే క్రికెట్‌లో నా చివరి మ్యాచ్ ఆడతాను. నేను ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కఠినమైన నిర్ణయం. ఇంగ్లండ్ కోసం నా తోటి ఆటగాళ్లతో ఆడే ప్రతి నిమిషం అద్భుతమైన క్షణం.. మేమంతా ఆ మార్గంలో అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించినందుకు చాలా సంతోషంగా ఉందని స్టోక్స్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

Ben Stokes

Ben Stokes

ఈ ఫార్మాట్‌లో 100శాతం నా ఆటలో ప్రదర్శనను కొనసాగించలేను. మూడు ఫార్మాట్‌లు ఇప్పుడు రాణించలేను. వరుస షెడ్యూల్ కారణంగా నా శరీరం నాకు సహకరించడం లేదు. ఆశించిన స్థాయిలో ఉత్సాహంగా ఆడలేననే ఉద్దేశంతోనే వన్డేలకు రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ స్టోక్స్ చెప్పుకొచ్చాడు. తన స్థానంలో మరో ఆటగాడికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నానని, జట్టులో మిగతా ఆటగాళ్లకు కూడా అవకాశాలు రావాల్సిన సమయం ఆసన్నమైందని స్టోక్స్ తెలిపాడు. గత 11 ఏళ్లలో తాను సాధించిన అనేక మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సమయం ఆసన్నమైందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.

న్యూజిల్యాండ్‌లో జ‌న్మించిన బెన్ స్టోక్స్.. తన కుటుంబంతో క‌లిసి చిన్న‌త‌నంలోనే ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. క్రికెట్‌కు పుట్టినిల్లు ఇంగ్లండ్‌లో క్రికెట్ పాఠాలు నేర్చుకున్న స్టోక్స్ ఆ దేశ జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా అవతరించాడు. ఒక బ్యాట‌ర్‌గానే కాదు.. బౌల‌ర్‌గానూ రాణించిన స్టోక్స్.. జ‌ట్టు సాధించిన అనేక విజ‌యాల్లో కీ రోల్ పోషించాడు. 31 ఏళ్ల స్టోక్స్‌… ఇంగ్లండ్ జ‌ట్టుకు 83 టెస్టులు, 101 వ‌న్డేలు, 39.44 సగటుతో 2,919 పరుగులు చేశాడు. ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లోనూ స్టోక్స్‌ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున ఆడిన స్టోక్స్.. ఈ ఏడాదిలో ముగిసిన ఐపీఎల్ సీజ‌న్‌లో కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌ఫున స్టోక్స్ ఆడాడు. 2019 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరిపోరులో 84 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా స్టోక్స్ ఎంపికయ్యాడు. 2011లో ఐర్లాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్టోక్స్ మూడు సెంచరీలతో సహా 2919 పరుగులు నమోదు చేశాడు. 74 వికెట్లు తీసుకున్నాడు. గత వేసవిలో పాకిస్తాన్‌పై 3-0తో రాయల్ లండన్ సిరీస్ విజయంలో ODI జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

Read Also :  IPL 2021 – Ben Stokes: బెన్‌స్టోక్స్ మొత్తం టోర్నమెంట్ నుంచే అవుట్