Hanuman Chalisa : హనుమాన్ చాలీసా చదువు ఆరోగ్యాన్ని రక్షించుకో..

ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకోటానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా బాగా పని చేస్తుందని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.

Hanuman Chalisa : హనుమాన్ చాలీసా చదువు ఆరోగ్యాన్ని రక్షించుకో..

Hanuman Chalisa

Hanuman Chalisa :  ఆరోగ్యాన్ని పదిలంగా రక్షించుకోటానికి హనుమాన్ చాలీసా పారాయణం చాలా బాగా పని చేస్తుందని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు. మందులు వాడుతూ, ఒక క్రమంలో హనుమాన్ చాలీసా చదవితే అద్బుతాలు సాధించవచ్చని అంటున్నారు. ముఖ్యంగా ఏల్నాటి శని, అర్ధాష్టమ శనిగాని, అష్టమశని గాని గోచార వశాత్తు జరుగుతున్నప్పుడు, శని మహర్ధశగానీ, శని వేధలు కానీ కలుగుతున్నప్పుడు హనుమాన్ చాలీసాను రోజుకు 11 సార్లు క్రమం తప్పకుండా చదివినట్లైతే శని వలన వచ్చే ఆనారోగ్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తగ్గుముఖం పడతాయని జ్యోతిష్య పండితులు చెప్పారు.

ఉదయాన్నే 11 సార్లు హనుమాన్ చాలీసా చదవలేని వారు ఉదయం స్నానం చేసి రాత్రి పడుకునే లోపల శుచిగా ఉన్నప్పుడు మిగిలిన 10సార్లు పూర్తిచేయాలన్నారు. ఇలా రోజుకు 11 సార్లు పారాయణం చేసినవారికి ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది స్తోత్రమే కానుక దీనికి నియమాలు అంతగా లేవన్నది జ్యోతిష్యుల సూచన. వెన్నునొప్పిగా ఉన్నావారు కానీ, నడుము నొప్పిగా ఉన్నవారు, నడుము నుంచి పాదాల దాకా ఏరకమైన నొప్పులు ఉన్నవారు అయినా, ఒళ్లు నొప్పులు ఉన్నవారు అయినా, అతిగా నిద్ర పోతున్నవారు కానీ, మందత్వం, అలసత్వం పోవాలన్నా…బధ్ధకంగా ఉన్నప్పుడు, జుట్టు ఎక్కువగా రాలుతున్నప్పుడూ.. జ్వరం వచ్చినప్పుడు ఈ స్తోత్రం చదివితే అద్భుతంగా పనిచేస్తుంది.

చంటి పిల్లలకు మూడు నాలుగేళ్లలోపు పిల్లలకు వచ్చే అంటువ్యాధులు కానీ, భయంతో వచ్చేజ్వరాలకు కానీ, దృష్టి దోషాల నుంచి కాపాడటానికి చేతిలో విభూతి తీసుకుని 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి అది పిల్లలకు పెడితే వారికి రక్షగా ఉంటుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. వజ్రతుల్యమైన దేహాన్ని పొందేందుకు ఈ స్తోత్రం ఉపయోగ పడుతుంది. జాతకంలో గండ దోషాలు ఉన్నా, మనకున్న వాహానం వల్ల రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే వాటినుంచి తప్పించుకోవచ్చు.

మృగశిర నక్షత్రం ఆంజనేయ స్వామివారికి అత్యంత ఇష్టమైన నక్షత్రం. ఎందుకంటే మృగశిర నక్షత్రం ఉన్నరోజునే మొదట ఆంజనేయ స్వామివారు సీత అమ్మవారి దర్శనం చేశారని పురాణ కధలు చెపుతున్నాయి. మృగశిర నక్షత్రరోజున 108 సార్లు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయగలిగితే తీవ్రమైన వ్యాధులు నిదానించటం మొదలవుతాయి. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారు రోజుకు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ, మృగశిర నక్షత్రం రోజు 108 సార్లు పారాయణ చేస్తే ఆ వ్యాధులు అదుపులో ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతటి విశేషవంతమైన స్తోత్రం ఈస్తోత్రం.

నిర్దారణ కాని వ్యాధులతో బాధపడుతున్నవారు, తమ వ్యాధికి సరైన వైద్యుడు దొరకక ఇబ్బంది పడుతున్నవారు ఆంజనేయ స్వామివారికి తమల పాకులతో పూజ చేసి రోజుకు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే సరైన వైద్యుడు దొరికి వ్యాధి నిర్ధారణ జరిగి వైద్యం లభిస్తుంది. కనుక వైద్యుడిచ్చే మందులు వాడుతూ దైవికంగా బలం సంపాదించుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని జ్యోతిష్యులు తెలిపారు. ఈ కలియుగంలో మనం పొందే అనారోగ్యాలన్నింటి నుంచి బయటపడేందుకు హనుమాన్ చాలీసా దివ్యమైనటువంటి స్తోత్రం.

హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥
శంకర సువన కేసరీ నందన ।
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
ఔర మనోరధ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥
అంత కాల రఘుపతి పురజాయీ ।
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
జో శత వార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥