Worold Milk Day 2023 : పచ్చి పాలు తాగితే ఎంత హాని చేస్తాయో తెలుసా?

నిత్య జీవితంలో పాలు వాడని వారు ఉండరు. అయితే ఎప్పుడు పడితే అప్పుడు కొనడం.. సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అనారోగ్యాల పాలయ్యే ప్రమాదం ఉంది. అలాగే నిత్యం పాలు తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 'వరల్డ్ మిల్క్ డే' సందర్భంగా పాల ప్రయోజనలు, ప్రాముఖ్యత గురించి గుర్తు చేసుకోవాలి.

Worold Milk Day 2023 : పచ్చి పాలు తాగితే ఎంత హాని చేస్తాయో తెలుసా?

Worold Milk Day

World Milk Day : టీ, కాఫీతో అందరికీ రోజు మొదలవుతుంది. పెరుగు, మజ్జిగతో భోజనం ముగిస్తాం. దేనికైనా పాలు ఖచ్చితంగా కావాలి. ప్రతి ఇంట్లో పాలు నిల్వ అయితే పెట్టుకుంటారు. అయితే పాలను వాడేటపుడు సరైన జాగ్రత్తలు పాటిస్తున్నారా? వరల్డ్ మిల్క్ డే సందర్భంగా పాలను ఇంట్లో నిల్వ ఉంచేటపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

‘వరల్డ్ మిల్క్ డే’ ఏటా జూన్ 1 న జరుపుతారు. పాల ప్రయోజనాలు.. ప్రాముఖ్యతతో పాటు పాలను నిల్వ ఉంచేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి  పెట్టాలి. శిశువు జన్మించగానే మొదట అందించే పోషకాహరం పాలు. పెరిగి పెద్దయ్యే కొద్ది అలవాటు మారుతుంది. పాలు, టీ లేదా కాఫీ తాగడం అయితే ప్రతి ఒక్కరిలో అలవాటు ఉంటుంది. కొంతమంది కార్న్‌ప్లేక్స్, రస్కులు, బిస్కెట్స్ ఇలాంటివి కూడా పాలల్లో ముంచి తింటూ ఉంటారు. ఇలా నిత్యం ఏదో రకంగా పాలను మనం వాడుతూ ఉంటాం. అయితే పాలు నిల్వ ఉంచే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

Health Benefits of Milk : పాలు అన్ని వయసుల వారికి ఒక అద్భుతమైన పానీయమా?

పాలు కొన్న వెంటనే ఫ్రిజ్ లో ఉంచడం అనేది చాలా ముఖ్యం. చాలామంది ఏదైనా షాపింగ్ పనిమీద బయటకు వెళ్తారు. ముందే పాలు కొనేసి తమ బ్యాగ్‌లో పెట్టుకుంటారు. షాపింగ్ మొత్తం అయ్యాక ఇంటికి వస్తారు. ఈలోపు అవి చల్లగా అయిపోతాయి. అలా కాకుండా షాపింగ్ మొత్తం ముగించుకుని ఇంటికి వచ్చేముందు మాత్రమే పాలు కొనాలి. కొంతమంది టీ లేదా కాఫీ కోసం పాలు వాడిన తరువాత మిగిలిన వాటిని బయట పెడుతుంటారు. అవి పుల్లగా మారతాయి. ఎక్కువసేపు బయట ఉంచిన పాలలో బ్యాక్టీరియా చేరుతుంది. అదీగాక చాలా సమయం బయట ఉంచినపుడు అవి పాడవుతాయి.

కొంతమంది పచ్చిపాలు తాగుతుంటారు. వీటిలో హానికారకమైన బ్యాక్టీరియా ఉంటుంది. అంతేకాకుండా పచ్చిపాలు తాగితే అజీర్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుండె జబ్బులు.. ఎలర్జీలు కూడా పచ్చిపాలను సేవించడం ద్వారా వచ్చే అకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చాలామంది పాలను పదే పదే మరిగిస్తుంటారు. పాలను తాగడానికి ముందు కొద్దిసేపు వేడి చేసుకుంటే చాలు.

Milk : పాలు నిద్రపట్టేలా చేస్తాయి ఎందుకు ?

మరీ ముఖ్యంగా రోజు గ్లాసు పాలు తాగడం ఎంతో ఆరోగ్యకరమని వైద్యులు చెబుతున్నారు. పాలలో ఉండే విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్‌లు.. ఎముకలు, కణాలు మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పాలను తగు జాగ్రత్తలు తీసుకుంటూ రోజు తీసుకోవడం అలవాటుగా మార్చుకోండి. ఆరోగ్యంగా ఉండండి.