Teacher recruitment scam: పార్థ ఛ‌ట‌ర్జీని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన మ‌మ‌తా బెన‌ర్జీ

ప‌శ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్థ ఛ‌టర్జీ ప‌శ్చిమ బెంగాల్‌ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఇప్ప‌టివ‌ర‌కు బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆయ‌న‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ఇటీవ‌లే అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీగా నగదు లభ్యమైంది.

Teacher recruitment scam: పార్థ ఛ‌ట‌ర్జీని మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించిన మ‌మ‌తా బెన‌ర్జీ

Partha

Teacher recruitment scam: ప‌శ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పార్థ ఛ‌టర్జీ ప‌శ్చిమ బెంగాల్‌ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రిగా ఇప్ప‌టివ‌ర‌కు బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. ఆయ‌న‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు ఇటీవ‌లే అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. ఉపాధ్యాయ నియామ‌క కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి కేసులో పార్థ ఛటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో మూడు రోజుల క్రితం సోదాలు జ‌రిపిన ఈడీ రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.

ఇవాళ తెల్లవారుజాము వరకు మ‌రోసారి సోదాలు జ‌రిపి దాదాపు రూ.21కోట్ల నగదు, ఐదు కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. దీంతో పార్థ ఛటర్జీని ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గతంలో పార్థ ఛ‌ట‌ర్జీ బెంగాల్‌ విద్యాశాఖ‌ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణి ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే పార్థ ఛ‌ట‌ర్జీని ఈడీ అధికారులు ప్ర‌శ్నించారు. ఈడీ క‌స్ట‌డీలోకి తీసుకున్నాక‌ పార్థ ఛటర్జీ అనారోగ్య కార‌ణాల‌తో ఆసుప‌త్రిలోనూ చేరారు.

India vs West Indies: 98 ప‌రుగులు చేశాక వ‌ర్షం ప‌డ‌డంపై శుభ్‌మ‌న్ గిల్ అసంతృప్తి