Mp Mahua Moitra : పోచంపల్లి చీర కట్టిన బెంగాల్‌ ఎంపీ..ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్

పశ్చిమబెంగాల్‌ ఎంపీ మహువా మొయిత్రా పోచంపల్లి చీర అందానికి ఫిదా అయిపోయారు.పోచంపల్లి చీర కట్టుకుని ఫోటో తీసి ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

Mp Mahua Moitra : పోచంపల్లి చీర కట్టిన బెంగాల్‌ ఎంపీ..ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్

Bengal Mp Mahua Moitra Wearing Pochampally Saree

Bengal mp Mahua Moitra wearing pochampally saree : పోచంపల్లి చీరలంటే మగువలకు ఎంత మక్కువో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దునియా మొత్తం పోచంపల్లి ఫేమస్‌‌ అయ్యింది. ఎక్కడెక్కడ నుంచో జనాలు పోచంపల్లికి వచ్చి చీరలు కొంటారు. అటువంటి మన పోచంపల్లి చీరకు పశ్చిమబెంగాల్‌ ఎంపీ మహువా మొయిత్రా ఫిదా అయిపోయారు.పోచంపల్లి చీర కట్టుకుని మురిసిపోయారు ఆ చీర కట్టుకుని ఫోటో తీసి ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు.

Read more : Afghanistanculture : ‘మావస్త్రధారణ జోలికొస్తే సహించేది లేదు’..మా దుస్తులే మా గళం

ఐటీ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా ఉన్న బెంగాల్ మహిళా ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఐటీ, చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్‌ ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పోచంపల్లి చీరను బహుమతిగా ఇచ్చారు.

Read more : MET Gala 2021: జిమ్నాస్టిక్ స్టార్ సిమోన్ 40కిలోల డ్రెస్ కోసం 100 మంది 6,650 గంటలు పనిచేశారట!

ఈ చీర అందానికి..మంత్రి కేటీఆర్ అభిమానానికి ఆమె ఎంతో సంతోషించారు. కేటీఆర్ బహూకరించిన ఆ చీరను ధరించిన ఆమె.. ‘ఇండియన్‌ హ్యాండ్లూమ్స్‌ రాక్‌. తెలంగాణకు చెందిన అత్యంత అందమైన పోచంపల్లి చీర ధరించాను. ఇటీవల ఐటీ కమిటీ టూర్‌లో కేటీఆర్‌ బహూకరించారు’ అని ట్వీట్‌ చేశారు. దీనికి మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ ‘పోచంపల్లి చేనేతను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మా బహుమతి మీకు నచ్చినందుకు సంతోషం’ అని రిప్లయ్‌ ఇచ్చారు.

కాగా..పరిశ్రమలు, వాణిజ్య శాఖలు నిర్వహిస్తోన్న మంత్రి కేటీఆర్ బ్రాండ్‌ ప్రమోషన్‌ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తెలంగాణకి సంబంధించిన హస్త కళలను చాలా హృంద్యంగా ప్రమోట్‌ చేస్తుంటారు. తాజాగా ఐటీ స్టాండింగ్‌ కమిటీ సభ్యురాలిగా టీఎంసీ ఎంపీ..ఫైర్‌ బ్రాండ్‌ గా పేరొందిన మహువా మోయిత్రా హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా ఎంపీ మెయిత్రాకి మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరను బహుకరించారు.ఆ చీరను మరింత ఆధునిక పద్దతిలో ధరించారు ఎంపీ మహువా మెయిత్రా.

Read more :MET Gala 2021 : మెట్ గాలాలో త‌ళుక్కుమ‌న్న సుధారెడ్డి..ఈమె ధరించిన గౌన్ వెరీ స్పెషల్

కాగా.. స్వాతంత్ర్యం రాకముందు అరబ్ దేశాలకు గాజులు పంపడంవల్ల ‘గాజుల పోచంపల్లి’ గా పేరు వచ్చింది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భూదానాలు చేయడం వల్ల భూదాన్‌‌ పోచంపల్లిగా మారింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌‌‌కు సుమూరు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది భూదాన్‌‌‌‌ పోచంపల్లి. హైదరాబాద్​ – విజయవాడ హైవే నుంచి 11 కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. పోచంపల్లి లోకి వెళ్తుంటే చుట్టూ కొండలు, రోడ్డుకు అటూ ఇటూ పచ్చని చెట్లు మనకి వెల్‌‌‌‌కం చెప్తాయి. ఆ తర్వాత ఊళ్లోకి వెళ్లగానే పోచంపల్లి, ఇక్కత్‌‌‌‌ చీరల షాపులు ఉంటాయి. చీరలు కొనేందుకు వచ్చిన జనాలతో భూదాన్‌‌‌‌ పోచంపల్లి ఎప్పుడూ సందడిగా ఉంటుంది. సిల్క్‌‌‌‌ సిటీగా పేరు పొందింది.